Begin typing your search above and press return to search.
బాబుకు గవర్నర్ ధైర్యవచనాలు
By: Tupaki Desk | 14 July 2015 11:19 AM GMTతప్పులు సహజం. అయితే.. 27 మంది ప్రాణాలు పోయేంత తప్పు జరిగితే ఎవరికైనా ఎంత బాధ ఉంటుంది. అందులోకి.. ప్రత్యక్షంగా కానీ.. పరోక్షంగా కానీ.. చోటు చేసుకున్న మరణాలకు తానే కారణమంటూ పలువురు వేలెత్తి చూపిస్తుంటే.. నిరాశలో కూరుకుపోవటం ఖాయం.
ఏ ముఖ్యమంత్రి మాత్రం.. తన కారణంగా పెద్ద ఎత్తున మరణాలు చోటు చేసుకోవాలని భావిస్తారు. పుష్కరాల సమయంలో తమ సర్కారు మరింత సమర్థంగా పని చేయటం ద్వారా పేరు ప్రఖ్యాతులు పొందాలని కోరుకుంటారే కానీ.. ఉన్న పేరు పోగొట్టుకోవాలని అనుకోరు.
కానీ.. ఇలాంటివేమీ పట్టించుకోకుండా రాజమండ్రి పుష్కర తొక్కిసలాట అంశంపై విపక్షాలు పెద్ద ఎత్తున విరుచుకుపడటం తెలిసిందే. దీంతో.. చంద్రబాబు తీవ్ర విషాదంలో మునిగిపోవటమే కాదు.. మీడియాతో మాట్లాడుతున్న సందర్భంగా కన్నీటి పర్యంతం అయ్యారు.
ఇదిలా ఉంటే.. జరిగిన దుర్ఘటనపై గవర్నర్ నరసింహన్ ఆరా తీశారు. ప్రమాదానికి చోటు చేసుకున్న కారణాల్ని బాబుకు ఫోన్ చేసి అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా విషాదంలో ఉన్న చంద్రబాబుకు ధైర్యం చెప్పిన ఆయన.. ఆపదకాలంలో కలిసి సాగుదామని చెప్పినట్లుగా చెబుతున్నారు. జరిగిన ఘటనపై ధైర్యంగా ఉండాలని చెప్పినట్లు చెబుతున్నారు. మృతుల కుటుంబాలకు తన సంతాపాన్ని తెలియజేసిన గవర్నర్.. చంద్రబాబుకు ధైర్యం చెప్పటం గమనార్హం. చూస్తుంటే.. రాజమండ్రి ఘటన బాబు ఆత్మస్థైర్యాన్ని బాగా దెబ్బ తీసిందన్న భావన వ్యక్తమవుతోంది. బాబుకు గవర్నర్ ధైర్యం చెప్పాల్సిన పరిస్థితి అంటే.. ఆయన అంతలా డీలా పడిపోయారా?