Begin typing your search above and press return to search.

గ‌వ‌ర్న‌ర్‌కు ఘోర అవ‌మానం.. అసెంబ్లీ నుంచి వాకౌట్‌!

By:  Tupaki Desk   |   10 Jan 2023 3:43 AM GMT
గ‌వ‌ర్న‌ర్‌కు ఘోర అవ‌మానం.. అసెంబ్లీ నుంచి వాకౌట్‌!
X
దేశంలో ప‌లువురు గ‌వ‌ర్న‌ర్‌లు త‌మ హుందా త‌నాన్ని ప‌క్క‌న పెట్టి రాజ‌కీయంగా చేస్తున్న వ్యాఖ్య‌లు.. రాష్ట్ర ప్ర‌భుత్వాల‌ను ఇరుకున పెట్టాల‌నుకునే వ్యూహాలు .. చివ‌ర‌కు వారికే అవ‌మానాల‌ను మోసుకువస్తు న్నాయి. తాజాగా తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవికి శాసన సభ సమావేశాల్లో ఘోర అవ‌మానం జ‌రిగింది. ఆయ‌న ప్ర‌సంగం ప్రారంభించ‌గానే... ప్ర‌తిప‌క్ష స‌భ్యులు స‌హా.. అధికార ప‌క్ష స‌భ్యుల్లో స‌గం మంది వాకౌట్ చేసి వెళ్లిపోయారు.

అంతేకాదు.. గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగంపై సీఎం స్టాలిన్‌.. ఆయ‌న స‌మ‌క్షంలో తీవ్ర అస‌హ‌నం, ఆగ్ర‌హం కూడా వ్య‌క్తం చేశారు. దీంతో గ‌వ‌ర్న‌ర్ కూడా కొద్ది సేప‌టికి.. క‌నీసం జాతీయ గీతం ఆల‌పించే వ‌ర‌కుఉండ‌కుండా నే అసెంబ్లీ నుంచి ఎలాంటి గౌర‌వ మ‌ర్యాద‌లు లేకుండానే ఒంట‌రిగా.. త‌న సిబ్బందితో రాజ్‌భ‌వ‌న్ దారి ప‌ట్టారు. ఈ ప‌రిణామం.. రాష్ట్ర వ్యాప్తంగా నే కాకుండా దేశంలో చ‌ర్చ‌కు వ‌చ్చింది.

అస‌లు ఏం జ‌రిగింది?

త‌మిళ‌నాడు గ‌వ‌ర్న‌ర్ ర‌వికి.. ప్ర‌భుత్వానికి, ప్ర‌తిప‌క్షాల‌కు కూడా.. ప‌డ‌డం లేదు. ఆయ‌న త‌మిళనాడు రాష్ట్రం పేరును మార్చాలంటూ.. ఇటీవ‌ల కొన్ని కీల‌క వ్యాఖ్య‌లు చేయ‌డంపై ఆయా ప‌క్షాలు ఆగ్ర‌హంతో ఉన్నాయి. ఇక‌, తాజాగా అసెంబ్లీ శీతాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. స‌భ‌లో తొలి రోజు గవర్నర్ ప్రసంగించడం ఆన‌వాయితీ. ఈ సంద‌ర్భంగా గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగాన్ని ప్ర‌భుత్వ‌మే రూపొందించి ఇస్తుంది. దీనిని ఆయ‌న టెక్నిక‌ల్‌గా చ‌ద‌వాల్సి ఉంది. ఇది అన్ని రాష్ట్రాల్లోనూ జ‌రిగేదే.

అయితే.. త‌మిళ‌నాడు గ‌వ‌ర్న‌ర్ ర‌వి మాత్రం.. ప్ర‌భుత్వం రాసిన‌ 65వ పేరాను చదవడం మానేశారు. దీనిలో ద్రవిడార్ కళగం వ్యవస్థాపకుడు పెరియార్, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్, మాజీ ముఖ్యమంత్రులు కే కామరాజ్, సీఎన్ అన్నాదురై, ద్రవిడియన్ మోడల్ ఆఫ్ గవర్నమెంట్‌ల గురించి ఉన్నాయి. అదేవిధంగా రాష్ట్రంలో శాంతిభద్రతల గురించి పేర్కొన్న పేరాను కూడా గవర్నర్ చదవలేదు.

దీంతో ఒక్క‌సారిగా అధికార ప‌క్షం ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. సీఎం స్టాలిన్ తీవ్ర‌స్థాయిలో స‌భ‌లోనే విరుచుకుప‌డ్డారు. అంతేకాదు.. ప్రభుత్వం రూపొందించిన గవర్నర్ ప్రసంగం(ఆయ‌న చ‌దివింది కాదు) మాత్రమే రికార్డుల్లో నమోదు కావాలని కోరుతూ స్టాలిన్ ఓ తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. దీంతో గవర్నర్ సభ ముగిసే సమయంలో వినిపించే జాతీయ గీతాన్ని వినిపించక ముందే సభ నుంచి వెళ్ళిపోయారు. ఇక‌, ఈ వ్య‌వ‌హారం జ‌రుగుతున్న స‌మ‌యంలోనే అధికా ర స‌భ్యుల్లో స‌గం మంది.. ప్ర‌తిప‌క్ష స‌భ్యులు మొత్తంగా స‌భ నుంచి వాకౌట్ చేశారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.