Begin typing your search above and press return to search.
సుష్మ.. సుమిత్ర.. ఉమాభారతిలకు ఆ పదవులు!
By: Tupaki Desk | 1 Jun 2019 12:20 PM GMTకారణం ఏదైనా కానీ.. సీనియర్లకు చెక్ చెప్పి తన సొంత టీంకు పెద్దపీట వేసుకునే విషయంలో మోడీ తాను అనుకున్నది అనుకున్నట్లుగా చేయగలుగుతారు. 75 ఏళ్లకు పైబడిన వారికి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వకూడదన్న రూల్ ను పెట్టుకొని అద్వానీ.. సుమిత్రా మహాజన్ లాంటి వారికి అవకాశం ఇవ్వని మోడీ మాష్టారు.. తాను అనుకున్నట్లే అనారోగ్యం కారణంగా ఎన్నికల బరిలో నిలవని సుష్మస్వరాజ్ కు మంత్రివర్గంలో చోటు కల్పించకపోవటం తెలిసిందే.
పార్టీ సీనియర్ నేతలు.. ఇమేజ్ ఉన్ననేతలకు పదవులు ఇవ్వనప్పుడు వ్యతిరేకత కామన్. కానీ.. ఇలాంటివాటిని పట్టించుకునే స్థితిలో మోడీ లేరని చెబుతున్నారు. తాను అనుకున్న దాని ప్రకారం.. పదవులు ఇవ్వకూడదని భావించిన వారికి ఇవ్వకుండా ఉన్న ఆయన.. తాజాగా కీలక నేతలను ఢిల్లీకి దూరంగా పంపాలన్న ఆలోచనలోకి వచ్చినట్లుగా చెబుతున్నారు.
పైకి చూసినప్పుడు డ్యామేజ్ కంట్రోల్ చేసినట్లుగా ఉంటూనే.. వారిని ఢిల్లీకి దూరం చేయటం ద్వారా తనకు తిరుగులేని రీతిలో చుట్టూ పరిస్థితులు ఉండాలన్నట్లుగా ఆయన ఆలోచనగా చెబుతున్నారు. పార్టీలో కీలక మహిళా నేతలుగా పేరున్న సుష్మా స్వరాజ్.. సుమిత్రా మహాజన్.. ఉమాభారతిలను పెద్ద రాష్ట్రాలకు గవర్నర్లుగా నియమించాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది.
ఈ నిర్ణయంతో మోడీకి రెండు రకాలైన లాభాలు ఉన్నాయని చెప్పొచ్చు. తాము పదవులు ఇవ్వని వారికి గౌరవనీయ స్థానాలు ఇచ్చేసిన భావన ప్రజల్లో కలిగేలా చేయటం ఒకటైతే.. ప్రత్యక్ష రాజకీయాలకు సెలవు చీటీ ఇచ్చేయటం మరో ఎత్తుగడగా చెబుతున్నారు. మొత్తానికి తాను కాదనుకున్నోళ్లను ఢిల్లీకి దూరంగా పంపేస్తున్న మాష్టారి ఐడియా ఆదిరిందని చెప్పక తప్పదు.