Begin typing your search above and press return to search.

విమానంలో గుండెపోటు.. కాపాడిన గవర్నర్ తమిళిసై

By:  Tupaki Desk   |   23 July 2022 4:51 PM GMT
విమానంలో గుండెపోటు.. కాపాడిన గవర్నర్ తమిళిసై
X
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వృత్తిరీత్యా వైద్యురాలైన ఓ వ్యక్తికి సకాలంలో వైద్యం అందించి అతడి ప్రాణాలను కాపాడారు.

వివరాల్లోకి వెళితే తమిళిసై వారణాసి నుండి న్యూఢిల్లీ మీదుగా హైదరాబాద్‌కు తిరిగి వస్తుండగా, అదే విమానంలో ఒక ప్రయాణికుడు ఛాతీ నొప్పితో బాధపడుతూ కనిపించాడు.

విమానంలోని క్యాబిన్ సిబ్బంది అత్యవసర సమయంలో సహాయం కోసం ప్రయత్నించారు. తమిళిసై విమానంలో ఉన్నందున ఈ పిలుపునకు స్పందించి రోగికి చికిత్స అందించారు. ఆమె గోల్డెన్ అవర్‌లో సీపీఆర్ ని నిర్వహించింది. ఇది బాధలో ఉన్న రోగికి ఉపశమనం కలిగించింది.

గవర్నర్ తమిళిసై స్పందించి రోగికి చికిత్స అందించడాన్ని తోటి ప్రయాణికులు అభినందించారు. ఆమె గతంలో డాక్టర్ కావడంతో ఈచికిత్స అందించి కాపాడింది.

తమిళిసై రోగి చిత్రాలు సోషల్ మీడియాలో షేర్ చేసింది. నెటిజన్లు తమిళిసై సమయానికి స్పందించిన తీరుపై ప్రశంసించారు.

గవర్నర్ తమిళిసై మద్రాస్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదివారు. చెన్నైలోని డాక్టర్ ఎంజీఆర్ మెడికల్ యూనివర్సిటీ నుండి స్పెషలైజేషన్ చేసారు. రాజకీయాల్లోకి రాకముందు ఆమె గైనకాలజిస్ట్‌గా ప్రాక్టీస్ చేసేవారు.అందుకే విమానంలో గుండెపోటుకు గురైన వ్యక్తికి సహాయం చేశాడు.