Begin typing your search above and press return to search.
తమిళ రాజకీయాల్లో అనూహ్య పరిణామం
By: Tupaki Desk | 19 Sep 2017 2:12 PM GMTఅమ్మ జయలలిత మరణించిననాటి నుంచి ఎప్పుడేం జరుగుతుందో తెలియని రీతిలో మారాయి తమిళనాడు రాజకీయాలు. అధికార అన్నాడీఎంకేలో చోటు చేసుకున్న చీలికల పుణ్యమా అని గడిచిన కొన్ని రోజులుగా తమిళ రాజకీయాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. తాజాగా చోటు చేసుకున్న పరిణాలు చూస్తే.. ఏం జరుగుతుందన్నది ఇప్పుడు అర్థం కానిదిగా మారింది.
ఇప్పటివరకూ జరిగింది సింఫుల్ గా చూస్తే.. అమ్మ మరణం తర్వాత ఆమె స్థానాన్ని భర్తీ చేయటానికి అమ్మ నెచ్చెలి శశికళ అలియాస్ చిన్నమ్మ పగ్గాలు చేపట్టే ప్రయత్నం చేశారు. అమ్మ అంతిమ సంస్కారాలు అయిపోయే సమయానికి పార్టీని తన పట్టులోకి తీసుకున్నారు. అమ్మకు అత్యంత విధేయుడైన పన్నీర్ సెల్వం సైతం చిన్నమ్మకు జీ హుజుర్ అన్నవాడే. అయితే.. కాలక్రమంలో పార్టీ పగ్గాలతో పాటు సీఎం కుర్చీ మీద కూడా కన్నేయటం పన్నీర్ కు నచ్చలేదు.దీంతో అన్నాడీఎంకే రెండు ముక్కలైంది.
ఈ నేపథ్యంలో తనకు సన్నిహితంగా ఉన్న పళనిస్వామిని సీఎం చేసింది చిన్నమ్మ. అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్లాల్సి వచ్చిన ఆమె పార్టీ బాధ్యతల్ని తనకు బంధువైన దినకరన్‌కు అప్పగించారు. అమ్మ మరణంతో ఖాళీ అయిన ఆర్కే నగర్ ఉప ఎన్నికకు తెర లేవటం.. పార్టీ గుర్తును చేజిక్కించుకోవటం కోసం అక్రమాలకు తెర తీయటం.. పెద్ద ఎత్తున డబ్బును వెదజల్లటం.. ఈ విషయం బయటకు వచ్చి దినకరన్ జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఇదే సమయంలో కేంద్రంలోని మోడీ అండ్ కో దృష్టి తమిళ రాజకీయాల మీద పడింది. అన్నాడీఎంకే చీలిక వర్గానికి తమ అండ ఉందన్న విషయాన్ని వారికి అర్థమయ్యేలా చెప్పటంతో అప్పటివరకూ భిన్న ధ్రువాలుగా ఉన్న పళని.. పన్నీరులు ఏకమయ్యారు. అదే సమయంలో చిన్నమ్మకు దూరమయ్యారు.
తన మాట వినని పళని.. పన్నీరులకు ఝులక్ ఇచ్చేందుకు దినకరన్ నేతృత్వంలో కొద్దిరోజుల క్రితం పావులు కదపటం మొదలైంది. తనకు మద్దతుగా ఉన్న 19 మంది ఎమ్మెల్యేల్ని తీసుకొని క్యాంప్ రాజకీయాల్ని నిర్వహించటం మొదలెట్టారు. దీంతో.. పళని సర్కారు మైనార్టీలో పడింది. పళని సర్కారును బలపరీక్షకు ఆదేశించాలని దినకరన్ వర్గం గవర్నర్ విద్యాసాగర్ రావును కోరారు. అయితే.. ఆయన అందుకు అంగీకరించలేదు.
ఇదిలా ఉండగా.. పార్టీని వీడిపోయి వేరుగా జట్టు కట్టిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేలా పళని వర్గం పావులు కదిపింది. స్పీకర్ ధనపాల్ పుణ్యమా అని పార్టీని వీడిన 18 మందిపై వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీన్ని వ్యతిరేకిస్తూ కోర్టుకు వెళ్లారు వేటు పడిన నేతలపై. కోర్టు విచారణ జరగాల్సిన సమయంలోనే గవర్నర్ విద్యాసాగర్ రావు చెన్నై చేరుకోవటం ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు పరిస్థితుల్లో బలపరీక్షకు పళని సర్కారును గవర్నర్ ఆదేశించే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. విపక్ష డీఎంకే సంచలన నిర్ణయాన్ని తీసుకునే అవకాశం ఉందంటున్నారు. తమ పార్టీకి చెందిన 100 మంది ఎమ్మెల్యేల చేత సామూహిక రాజీనామాలు చేయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. దినకరన్‌కు మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేల పుణ్యమా అని పళని సర్కారు మేజిక్ ఫిగర్‌ను చేరుకోలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏమైనా.. రానున్న రెండు.. మూడు రోజుల్లో తమిళనాడు రాజకీయాలు కీలక మలుపు తిరిగే అవకాశం ఉందని చెప్పక తప్పదు.