Begin typing your search above and press return to search.
గోవింద నామం.. ఇప్పుడు పార్టీలకు సరికొత్త ఆయుధం
By: Tupaki Desk | 16 Nov 2021 10:30 AM GMTఒక యూ ట్యూబ్ ఛానల్ లో మొదలైన ‘గోవింద నామం’ ఇప్పుడు రాజకీయ పార్టీలకు సరికొత్త ఆయుధంగా మారింది. ఇటీవల వెల్లడైన హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితం నేపథ్యంలో.. హుజూరాబాద్ గోవిందా.. కేసీఆరూ గోవిందా అంటూ మూడు నిమిషాలకు పైనే నిడివి ఉన్న ఒక వ్యంగ్య వీడియో విపరీతంగా వైరల్ కావటం తెలిసిందే. ఈ వీడియోలో టీఆర్ఎస్ అధినేత.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఉన్న విమర్శల్ని.. గోవింద నామంతో ముడి పెడుతూ చేసిన వీడియో సక్సెస్ కావటంతో పాటు.. ఈ తీరు ఇప్పుడు పాపులర్ గా మారింది. కేసీఆర్ ను విమర్శించాలన్నా.. బహిరంగ నిరసనల్లో ప్రస్తావించాలన్నా.. ఈ గోవింద నామాన్ని జపిస్తున్నారు.
గోవింద నామంతో రాజకీయ ప్రత్యర్థులపై విరుచుకుపడే విధానం సూపర్ హిట్ కావటంతో పాటు.. అందరిని విపరీతంగా ఆకర్షించటంతో.. దీన్నిగులాబీ నేతలు సైతం కాపీ చేస్తున్నారు. తాజాగా నల్గొండ జిల్లాలో టీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పర్యటన సందర్భంగా గోవింద నామంతో టీఆర్ఎస్ నేతలు.. కార్యకర్తలపై విరుచుకుపడ్డారు బీజేపీ నేతలు.. కార్యకర్తలు.
ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేసీఆర్ సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ.. వారి కష్టాల్ని స్వయంగా అడిగి తెలుసుకునేందుకు బండి సంజయ్ సోమవారం నల్గొండ జిల్లాలోని ఐకేపీ కేంద్రాల్ని సందర్శించారు. ఈ సందర్భంగా బండి ప్రోగ్రాంను అడ్డుకోవాలని గులాబీ బ్యాచ్ పెద్ద ఎత్తున ప్రయత్నాల్ని చేసింది. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య పెద్ద ఎత్తున ఘర్షణ సాగింది. కోడిగుడ్లను విసరటం.. రాళ్ల దాడికి పాల్పడటం లాంటివి చేశారు. గులాబీ బ్యాచ్ దాడికి ప్రతిగా కమలనాథులు సైతం ఎదురుదాడి చేయటం షురూ చేశారు.
దీంతో భారీ ఉద్రిక్తతకు దారి తీసింది. ఇదిలా ఉండగా.. బండి సంజయ్ ప్రోగ్రాంను అడ్డుకునేందుకు.. ఆయన్ను ముందుకు కదలకుండా చేసేందుకు టీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్న వేళ..బీజేపీ కార్యకర్తలు కేసీఆర్ కు వ్యతిరేకంగా గోవింద నామాల్ని షురూ చేశారు. ‘దళిత సీఎం గోవిందా.. మూడెకరాలు గోవిందా.. డబుల్ బెడ్రూం గోవిందా.. హుజూరాబాద్ గోవిందా.. దళిత బంధు గోవిందా’ అంటూ మొదలైన నామాలకు ప్రతిగా టీఆర్ఎస్ కార్యకర్తలు సైతం కౌంటర్ గోవింద నామాల్ని షురూ చేశారు.
‘రెండు కోట్ల ఉద్యోగాలు గోవిందా.. నల్లధనం గోవిందా.. గ్యాస్ బండ.. ఇంధన ధరలు గోవిందా.. వరి కొనుగోళ్లు గోవిందా’ అంటూ కౌంటర్ గా టీఆర్ఎస్ శ్రేణులు గోవింద నామాల్ని షురూ చేయటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.ఇటీవల కాలంలో మాటల జోరు పెరిగిన వేళ.. తమ రాజకీయ ప్రత్యర్థుల్ని ఉద్దేశించి డౌన్.. డౌన్ అనటం.. వారికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయటం తెలిసిందే.
దీనిపై కొన్ని సందర్భంగా పోలీసులు అధికార వర్గానికి వ్యతిరేకంగా నినాదాలు చేసే వారిపై కేసులు నమోదు చేస్తున్నారన్న ఆరోపణ ఉంది. అందుకు కౌంటర్ గా.. ఎవరూ వేలెత్తి చూపలేని రీతిలో గోవింద నామాల్ని జపిస్తూ.. పంచ్ ల మీద పంచ్ లు వేస్తున్న వైనం బీజేపీ నేతలకు కొత్త ఆయుధంగా మారింది. దీన్ని తాము సైతం ఆయుధంగా మార్చుకునేలా టీఆర్ఎస్ శ్రేణులు వ్యవహరించిన తీరు చూస్తే.. తెలుగు రాజకీయాల్లో గోవింద నామాలతో అటాక్ చేయటం ఆసక్తికర పరిణామంగా మారింది.