Begin typing your search above and press return to search.
'బ్యాంకులు' పాత నోట్లు మార్చుకోవచ్చు!
By: Tupaki Desk | 21 Jun 2017 8:31 AM GMTపెద్దనోట్ల రద్దు అనంతరం కొన్ని బ్యాంకులు, పోస్టాఫీసుల్లో పాత రూ.500, రూ.1000 నోట్లు మిగిలిపోయాయి. గడువు ముగిసి పోవడంతో ఆర్బీఐ వాటిని స్వీకరించేందుకు నిరాకరించిందిం. దీంతో, ఆ బ్యాంకులు, పోస్టాఫీసుల్లో నగదు కొరత ఏర్పడింది. తాజాగా ఆ బ్యాంకులు, పోస్టాఫీసులకు ఊరటనిస్తూ కేంద్రం ఉత్తర్వలు జారీ చేసింది. ఆ నోట్లను ఆర్బీఐలో జమ చేసుకునేందుకు ఆయా బ్యాంకులు, పోస్టాఫీసులకు నెల రోజుల గడువునిచ్చింది.
తాజా ఉత్తర్వుల ప్రకారం పాత రూ.500, రూ.1000నోట్లు ఉన్న బ్యాంకులు, పోస్టాఫీసులు జులై 20 లోగా ఏ ఆర్బీఐ బ్రాంచిలోనైనా జమచేసుకుని, కొత్త నోట్లను తీసుకోవచ్చని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది.ఈ ఉత్తర్వుల వల్ల జిల్లా కోఆపరేటివ్ బ్యాంకులకు, మరీ ముఖ్యంగా మహారాష్ట్రలోని బ్యాంకులకు పెద్ద వూరట లభించినట్లయింది.
ఆయా బ్యాంకులు డిసెంబరు 30, 2016 వరకు తీసుకున్న పాత నోట్లను ఆర్బీఐలో డిపాజిట్ చేసుకోవచ్చు. అయితే, సహకార బ్యాంకులు నవంబర్ 10-14 లోపు తీసుకున్న నోట్లను మాత్రమే మార్చుకునేందుకు వీలుంటుందని తెలిపింది.
30 రోజులలోపు పోస్టాఫీసులు, బ్యాంకులు, జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు తమ ఖాతాల ద్వారా ఆర్బీఐలో నిబంధనల ప్రకారం జమ చేసుకునే సదుపాయాన్నికేంద్రం కల్పించింది. గతంలో పాతనోట్లు మార్చుకోకపోవడానికి గల కారణాలను బ్యాంకులు, పోస్టాఫీసులు ఆర్బీఐకి వివరించాలి. ఆ కారణాలు సంతృప్తికరంగా ఉంటేనే ఆర్బీఐ ఆ నోట్లను స్వీకరిస్తుంది.
గతంలో పాత నోట్ల జమకు ఇచ్చిన గడువు ముగియడంతో ఆర్బీఐ ఆ నోట్లను తీసుకునేందుకు నిరాకరించించింది. దీంతో, ఆయా బ్యాంకుల వద్ద పాత నోట్లు ఉండటంతో నగదు కొరత ఏర్పడింది. దాదాపు రూ.340కోట్ల రూ.500, రూ.1000 పాత నోట్లు జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల్లో ఉన్నాయని డీసీసీబీ ఛైర్మన్ నరేంద్ర దరడే తెలిపారు.
కాగా, కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వెనుక మరో కారణం ఉందన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది. వ్యవసాయపనులు ఊపందుకుంటున్న సమయంలో రైతు రుణాలకు పెద్ద ఎత్తున దరఖాస్తులు వస్తున్నాయి. అయితే ప్రాథమిక సహకార సంఘాలకు తీవ్ర నిధుల కొరత కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో సదరు సమస్యను ఎదుర్కునేందుకు ఈ అవకాశం ఇచ్చినట్లు చెప్తున్నారు. ఈ నిర్ణయం వల్ల బీజేపీ పాలిత రాష్ట్రమైన మహారాష్ట్రలోని రైతులకు మేలు జరుగుతుందని అంటున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/