Begin typing your search above and press return to search.
వాటితో పాటే కండోమ్స్ కూడా!
By: Tupaki Desk | 9 April 2015 10:30 PM GMTమీ అవసరమే మా అవకాశం అనే స్థాయిలో రోజు రోజుకూ పెరుగుతున్న డయాబెటిస్ వ్యాదిగ్రస్తుల అవసరాన్ని గుర్తించిన ఫార్మా కంపెనీలు ఇదే అదనుగా వాటి ధరలను పెంచనున్నాయి. హెపటైటిస్, డయాబెటిస్, క్యాన్సర్ సహా వివిధ వ్యాధుల చికిత్సలో వాడే సుమారు 509 అత్యవసర మందుల ధరలను పెంచడానికి ఫార్మా కంపెనీలకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. దీంతో ఆయా కంపెనీలు ఈ ఔషధాల ధరలను 3.84 శాతం వరకూ పెంచేసుకునే వీలు కల్పించింది ప్రభుత్వం! ఈ మేరకు జాతీయ ఫార్మాసూటికల్ ప్రైసింగ్ అథార్టీ (ఎన్‌పిపిఎ), డిపిసిఒ (డ్రగ్‌ప్రైస్ కంట్రోల్ ఆర్డర్) - 2013 కింద 2014 హోల్‌సేల్ ధరల సూచీని విడుదల చేస్తూ ఒక నోటిఫికేషన్‌ను జారీ చేసింది. దీని ప్రకారం సుమారు 509 ఔషధాల్లో హె పటైటిస్ బి, సి చికిత్సలో వాడే ఇంటర్‌ఫెరాన్ ఇంజక్షన్, ఫంగల్ వ్యాధుల చికిత్సలో వాడే ఫ్లుకొనజోల్ క్యాప్సూల్స్, క్యాన్సర్ నివారణకు వాడే కార్బొప్లాటిన్ ఇంజక్షన్, టి బయాటిక్ అమోక్సిసిలిన్ ఉన్న టాబ్లెట్లతో పాటు కండోమ్స్ కూడా ఉన్నాయి! అయితే ప్రభుత్వం ఎయిడ్స్ వ్యాది నివారణా చర్యల్లో భాగంగా ఈ కండోమ్స్ ని ఉచితంగా ఇస్తున్న తరుణంలో... వీటి ధరను పెంచేలా అనుమతిలు ఇవ్వడంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి!