Begin typing your search above and press return to search.

పోర్న్ మీద గూగుల్.. ఫేస్ బుక్ అండ్ కోకు కేంద్రం క్వశ్చన్స్

By:  Tupaki Desk   |   16 Jan 2020 4:27 AM GMT
పోర్న్ మీద గూగుల్.. ఫేస్ బుక్ అండ్ కోకు కేంద్రం క్వశ్చన్స్
X
ఇటీవల కాలంలో దేశంలో పెరిగిపోతున్న అత్యాచారాలు.. లైంగిక వేధింపులకు.. దారుణమైన నేరాలకు విచ్చల విడిగా దొరికేస్తున్న పోర్న్ వీడియోలు కూడా కారణమన్న వాదన తరచూ వినిపిస్తోంది. దీనికి జియో ఎంట్రీ కూడా కారణమని చెబుతున్నారు. డేటాను కారుచౌకగా అందించటమే కాదు.. రోజూ పొద్దున్నే టిఫిన్.. మధ్యాహ్నం భోజనం.. సాయంత్రం స్నాక్స్.. రాత్రి భోజనం మాదిరే.. డేటాను 24 గంటలు ఆన్ లో ఉంచేసి.. ఏ మాత్రం వీలు దొరికినా ఏదోలా జీబీలకు.. జీబీల చొప్పున డేటాను ఖర్చు చేసేలా జియో ఛాన్స్ ఇచ్చిందని చెబుతున్నారు.

బఠాణీల కంటే తక్కువ ధరకు అందుబాటులోకి వచ్చిన డేటాను ఎక్కువమంది పోర్న్ వీడియోలు చూసేందుకే వినియోగిస్తున్నారని చెబుతున్నారు. ఇలాంటివేళ.. సోషల్ మీడియాలోనూ.. సెర్చింజన్లలోనూ పోర్న్ ను కంట్రోల్ చేసేందుకు వీలుగా కేంద్రం రంగంలోకి దిగింది. అడల్ట్ పోర్నోగ్రఫీ.. చిన్నపిల్లలపై వేధింపులకు సంబంధించిన వీడియోలను నిరోధించటానికి ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ తోపుల్లాంటి సంస్థలకు క్వశ్చన్లు వేసింది.

పార్లమెంటరీ కమిటీ వేసిన ప్రశ్నలకు ప్రఖ్యాత సెర్చింజన్ గూగుల్.. సోషల్ మీడియా సంస్థలైన ఫేస్ బుక్.. ట్విట్టర్ .. టిక్ టాక్ లతో పాటు పలు సంస్థలు సమాధానాలు ఇచ్చాయి. వారేమన్నారన్నది చూస్తే.. అడల్ట్ కంటెంట్ ను చూసేందుకు లాగిన్ అవసరమని.. అలా లేకుండా కంటెంట్ ఇవ్వటం లేదని గూగుల్ చెప్పింది. యూట్యూబ్ పాలసీ ప్రకారం కంటెంట్ క్రియేట్ చేసే వారు ఆయా వీడియోలకు వయో పరిమితిని పెట్టొచ్చని పేర్కొంది. ఈ పరిమితిని పెట్టిన వీడియోలను 18 ఏళ్ల లోపు వారు చూడలేరని చెప్పింది.

షేర్ చాట్ సంస్థ బదులిస్తూ.. అమెరికాలో రూపొందించిన చట్టాలకు సరిపోయేలా నిబంధనల్ని రూపొందిస్తున్నట్లు చెప్పిన ఈ సంస్థ తమ వద్ద షేర్ అయ్యే అడల్ట్ కంటెంట్ చూడాలంటూ వయసు తప్పనిసరిగా పేర్కొనాల్సిందేనని స్పష్టం చేసింది. ఇక ట్విట్టర్ బదులిస్తూ..పరస్పర అంగీకారంతో కూడిన శృంగారానికి సంబంధించిన వీడియోలను మాత్రమే అనుమతిస్తామని.. రేప్.. చైల్డ్ ఫోర్నోగ్రఫీ లాంటి వాటిని అనుమతించమని చెప్పింది. అంతేకాదు.. అడల్ట్ కంటెంట్ కు సంబంధించి కొత్త నిబంధనల్ని తీసుకొచ్చినట్లు సదరు సంస్థ చెబుతోంది.

అనుమతితో కూడి అడల్ట్ కంటెంట్ ను యూజర్లు షేర్ చేయొచ్చని.. అందుకు భిన్నమైన సెన్సిటివ్ కంటెంట్ ను మాత్రం మార్క్ చేయాలని స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాను రాజ్యమేలుతున్న ఫేస్ బుక్.. ఇన్ స్టాలు మాత్రం న్యూడ్ కంటెంట్ ను తాము అనుమతించటం లేదని స్పష్టం చేసింది. బ్రెస్ట్ ఫీడింగ్.. పోస్ట్ మాస్టెక్టెమీ గాయాలు లాంటి వీడియోలను అనుమతిస్తుందని.. విద్య.. వైద్యపరమైన అంశాలకు సంబంధించిన న్యూడ్ కంటెంట్ ను తాము ఓకే చెబుతామని ఫేస్ బుక్.. ఇన్ స్టాలు స్పష్టం చేశాయి.

మనదేశంలో పోర్న్ చూడటం నేరం కాదు. కాకుంటే.. చైల్డ్ పోర్న్ చూడటం.. వీడియోల్ని షేర్ చేయటం మీద మాత్రం పరిమితులు ఉన్నాయి. ఇలాంటి వాటిని చూడటం.. షేర్ చేయటం నేరమే కాదు.. కఠినమైన శిక్షలు కూడా అమల్లో ఉన్నాయి. ఇదిలా ఉంటే.. మన దేశంలో పలు పోర్న్ వెబ్ సైట్లపై నిషేధం కొనసాగుతున్నా.. సెర్చింజన్ ను ఓపెన్ చేసి టైప్ చేయాలే కానీ.. అడల్ట్ కంటెంట్ కు అడ్డూఆపు లేదని చెప్పక తప్పదు.