Begin typing your search above and press return to search.

ఉల్లి బాంబ్ పై కేంద్రం కఠిన నిర్ణయం

By:  Tupaki Desk   |   29 Sep 2019 11:22 AM GMT
ఉల్లి బాంబ్ పై కేంద్రం కఠిన నిర్ణయం
X
దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు ఆకాశాన్ని అంటుతుండడం బీహార్ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో ఉల్లి గౌడన్లపై పడి ఉల్లిని దోపిడీ చేస్తున్న ఘటనలు చూసిన కేంద్రం నష్ట నివారణ చర్యలు చేపట్టింది.

ప్రస్తుతం ఉల్లి ధరలు ఢిల్లీ సహా ఉత్తరాదిలో కిలోకు రూ.80 వరకు పలుకుతున్నాయి. హైదరాబాద్ మార్కెట్లో రూ.50వరకూ ధర ఉంది. పైగా నాణ్యత కూడా నాసిరకంగానే ఉంటోంది.

ఈ నేపథ్యంలో ఉల్లి ధరపై సామాన్యుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేంద్రం కఠిన నిర్ణయం తీసుకుంది. అన్ని రకాల ఉల్లి ఎగుమతులపై తాత్కాలిక నిషేధం విధిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. తాము చెప్పేవరకూ ఉల్లి ఎగుమతులు నిలిపివేయాలని వ్యాపారులు - ప్రభుత్వం ఎగుమతి సంస్థలకు ఆదేశాలు ఇచ్చింది. నిషేధం ఆదివారం నుంచే అమల్లోకి వస్తున్నట్టు పేర్కొంది.

ఉల్లి ధర పెరగడానికి అసలు కారణం నిల్వలను దాచిపెట్టడమేనని కేంద్రం భావిస్తోంది. కృత్రిమ కొరత సృష్టించి ధరలు పెంచుతున్నారని గుర్తించింది. రాష్ట్ర ప్రభుత్వాలు తక్కువ ధరకు ఉల్లిని ప్రజలకు అందించాలని సూచించింది. ఈమేరకు ఢిల్లీ, పంజాబ్ ప్రభుత్వాలు ప్రజలకు రేషన్ షాపుల ద్వారా కిలో.25 చొప్పున ప్రజలకు ఒక్కొక్కరికి రెండు కిలోలు సరఫరాను ప్రారంభించాయి.