Begin typing your search above and press return to search.

హైఅలెర్ట్‌: త‌్రివిధ ద‌ళాల‌కు సెల‌వులు ర‌ద్దు!

By:  Tupaki Desk   |   26 Feb 2019 8:31 AM GMT
హైఅలెర్ట్‌: త‌్రివిధ ద‌ళాల‌కు సెల‌వులు ర‌ద్దు!
X
భార‌త్- పాక్ మ‌ధ్య చోటు చేసుకున్న తాజా ప‌రిణామాల‌తో రెండు దేశాల్లో వాతావ‌ర‌ణం హాట్ హాట్ గా మారింది. రెండు దేశాల స‌రిహ‌ద్దుల వ‌ద్ద యుద్ధ వాతావ‌ర‌ణం నెల‌కొంది. పుల్వామా ఉగ్ర‌దాడికి బ‌దులు తీర్చుకునేందుకు భార‌త్ మెరుపుదాడుల్ని చేప‌ట్ట‌టం.. వైమానిక సైన్యం చేప‌ట్టిన ఈ ఆప‌రేష‌న్లో దాదాపు 300 ల‌కు పైగా ఉగ్ర‌వాదులు మ‌ర‌ణించిన‌ట్లుగా తెలుస్తోంది.

దీనిపై పాక్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌ట‌మే కాదు.. త‌మ స‌రిహ‌ద్దుల్లోనూ భార‌త్ దాడులు చేసిన‌ట్లుగా చెబుతోంది. పాక్ పెద్ద‌ల స‌భ భార‌త్ దాడుల్ని ఖండిస్తూ ఏక‌గ్రీవ తీర్మానం చేసింది. ఇదిలా ఉంటే.. తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో భార‌త్ అప్ర‌మ‌త్తంగా ఉంది. త్రివిధ ద‌ళాల సైనికుల‌కు సెల‌వులు ర‌ద్దు చేస్తూ భార‌త ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. నేవీ.. ఆర్మీ.. ఎయిర్ ఫోర్స్ విబాగాల‌కు ఇప్ప‌టికే ఆదేశాలు జారీ చేశారు.

సెల‌వుల్లో ఉన్న వారు త‌క్ష‌ణ‌మే విధుల్లోకి పాల్గొనాల్సిందిగా ఆదేశాలు అందాయి. భార‌త స‌రిహ‌ద్దుల్లోని గ్రామాల వారిని అలెర్ట్ చుస్తూ.. సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లి వెళ్లాల్సిందిగా సూచ‌న చేశారు. మ‌రోవైపు భార‌త మెరుపు దాడుల అనంత‌రం ఈ ఉద‌యం ఆరున్న‌ర ప్రాంతంలో పాక్ సైన్యం డ్రోన్ ను ఉప‌యోగించింది. భార‌త స‌రిహ‌ద్దుల్లోకి వ‌చ్చిన వెంట‌నే దాన్ని సైన్యం కూల్చేసింది. మొత్తం 12 జెట్ మిరేజ్ ఫైట‌ర్ల‌తో భార‌త వైమానిక ద‌ళం పాక్ ఉగ్ర శిబిరాల‌పై విరుచుకుప‌డింది.

తాజా దాడుల నేప‌థ్యంలో దేశ వ్యాప్తంగా ఉన్న ఆర్మీ క్యాంపులు.. ఎయిర్ బేస్ ల వ‌ద్ద అప్ర‌మ‌త్తం చేశారు. గుజ‌రాత్ స‌రిహ‌ద్దు ప్రాంతంలోనూ హై అలెర్ట్ ప్ర‌క‌టించారు. తాజా ప‌రిణామాల‌పై కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ స్పందించారు. భార‌త వైమానిక ద‌ళానికి సెల్యూట్ అంటూ ట్వీట్ చేశారు.