Begin typing your search above and press return to search.

638 మంది దగ్గరున్న నల్లధనం ఎంతంటే..?

By:  Tupaki Desk   |   1 Oct 2015 12:22 PM IST
638 మంది దగ్గరున్న నల్లధనం ఎంతంటే..?
X
తమ దగ్గరున్న నల్లధనం గురించిన వివరాలు స్వచ్ఛందంగా వెల్లడించి.. సదరు వెల్లడించిన ఆస్తుల విలువలో 60 శాతం మొత్తాన్ని జరిమానా రూపంలో చెల్లిస్తే సరిపోతుందన్న ఆఫర్ బుధవారం రాత్రితో ముగిసింది.

దేశ వ్యాప్తంగా అమలు చేసిన ఈ పథకానికి ఒక మోస్తరుగానే స్పందన వచ్చిందని చెప్పాలి. ఎందుకంటే.. దేశవ్యాప్తంగా 638 మంది మాత్రమే తమ వద్ద నల్లధనం ఉన్నట్లుగా వెల్లడించారు. తమ వద్దనున్న నల్లధనం మొత్తం రూ.3,770కోట్లుగా వారు వెల్లడించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. నల్లధనం దాచిన వారు తమ వివరాలు వెల్లడించిన వారు పన్ను బకాయిలు చెల్లించేందుకు డిసెంబరు 31 వరకు గడువును ఇచ్చారు.

ఇక.. నల్లధనం గడువు ముగిసిన తర్వాత కానీ వివరాలు ప్రకటిస్తే.. మొత్తం విలువకు 120 శాతాన్ని పన్ను.. జరిమానా రూపంలో ప్రభుత్వానికి కట్టాల్సి ఉంటుంది. 125 కోట్ల భారతీయుల్లో నల్లధనం దాచుకున్న వారి సంఖ్య 638 మంది మాత్రమే అంటే విస్మయం చెందాల్సిందే. అంటే.. మిగిలిన వారంతా వైట్ మనీనే కలిగి ఉన్నారంటారా..?