Begin typing your search above and press return to search.

మోడీని ఎట‌కారం చేసేసిన మిత్రుడు

By:  Tupaki Desk   |   1 Sep 2017 11:32 AM GMT
మోడీని ఎట‌కారం చేసేసిన మిత్రుడు
X
పెద్ద నోట్ల ర‌ద్దు నిర్ణ‌యం దేశ వ్యాప్తంగా ఎంత సంచ‌ల‌నం సృష్టించిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. పెద్ద నోట్ల ర‌ద్దు కార‌ణం దేశ ప్ర‌జ‌లు దాదాపు రెండు నెల‌ల పాటు చుక్క‌లు చూపించింది. అయితే.. అవినీతి మీద.. న‌కిలీ నోట్ల మీదా మోడీ స‌ర్కారు పూరించిన స‌మ‌రంగా. బీజేపీ నేత‌లు అభివ‌ర్ణించారు. ఆ మాట‌కు వ‌స్తే.. పెద్ద నోట్ల ర‌ద్దు నిర్ణ‌యం కార‌ణంగా దేశానికి చాలానే మేలు జ‌రిగింద‌న్న భావ‌న‌లో స‌గ‌టు జీవి ఉన్న ప‌రిస్థితి.

అయితే.. నోట్ల ర‌ద్దు నిర్ణ‌యం ఒక విఫ‌ల‌య‌త్నంగా.. భారీ కుంభ‌కోణంగా విప‌క్షాలు అభివ‌ర్ణించాయి. మోడీ తీసుకున్న నిర్ణ‌యం కార‌ణంగా దేశం భారీగా న‌ష్ట‌పోయింద‌ని.. ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు ఈ నిర్ణ‌యం శ‌రాఘాతంగా అభివ‌ర్ణించిన వారున్నారు. అయితే.. నోట్ల ర‌ద్దును రాజ‌కీయం చేసేందుకే విపక్షాలు ఈ త‌ర‌హా వాద‌న‌ను వినిపించిన‌ట్లుగా అభిప్రాయం వ్య‌క్త‌మైంది.

ఇదిలా ఉంటూ.. తాజాగా రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుద‌ల చేసిన నివేదికతో మోడీ స‌ర్కారు డిఫెన్స్ లో ప‌డిన‌ట్లైంది. నోట్ల ర‌ద్దుపై మోడీ స‌ర్కారు తీసుకున్న‌ నిర్ణ‌యాన్ని స‌మ‌ర్థిస్తూ ఆర్ బీఐ నివేదిక విడుద‌ల చేసినా.. అందులో పేర్కొన్న అంశాలు మోడీ బ్యాచ్‌కు త‌ల‌నొప్పిగా మారాయి. మొత్తం పాత నోట్ల‌లో 99 శాతం తిరిగి వ‌చ్చేశాయ‌ని గొప్ప‌లు చెప్పుకుంది.

దీన్ని విప‌క్షాలు ఘోర వైఫ‌ల్యంగా అభివ‌ర్ణించాయి. నోట్ల ర‌ద్దు కార‌ణంగా మోడీ స‌ర్కారు సాధించిందేమిటన్న సూటిప్ర‌శ్న‌ను సంధిస్తున్నాయి. విపక్షాల వాద‌న‌లో నిజం ఉంద‌న్న‌ట్లుగా బీజేపీ మిత్రుడు శివ‌సేన సైతం ఇదే తీరులో గ‌ళం విప్ప‌టం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది.

తాజాగా ఆ పార్టీ అధికారిక ప‌త్రిక అయిన సామ్నాలో ఓ సంపాద‌కీయాన్ని ప్ర‌చురించారు. అందులో పెద్ద‌నోట్ల ర‌ద్దు నిర్ణ‌యంలోని వైఫ‌ల్యాల్ని ఎత్తి చూపారు. డిపాజిట్ కాని ఒక్క‌శాతం న‌ల్ల‌ధ‌నం కాద‌ని.. బ‌హుశా బ్యాంకు క్యూలో నిలుచునే ఓపిక లేక‌నే సామాన్యులు ఆ డ‌బ్బును వ‌దిలేసి ఉంటార‌ని పేర్కొంది. నిజంగా న‌ల్ల‌ధ‌నం ఎవ‌రైతే క‌లిగి ఉన్నారు వారి మీద నోట్ల ర‌ద్దు ఎలాంటి ప్ర‌భావం చూప‌లేక‌పోయిందంది.

సుమారు రూ.26వేల కోట్ల ధ‌నం బ్యాంకుల్లో డిపాజిట్ కాలేద‌ని.. కొత్త నోట్ల ముద్ర‌న పేరుతో రూ.21వేల కోట్ల‌ను వృథా చేశార‌న్నారు. కేవ‌లం ప్ర‌చారం కోస‌మే ఈ నిర్ణ‌యాన్ని తీసుకున్నారే త‌ప్పించి ఇందులో ఎలాంటి ప్ర‌యోజ‌నం లేద‌ని ఎత్తి చూపింది. ప్ర‌చారం కోసం భారీ మొత్తాన్ని మోడీ స‌ర్కారు పార‌బోసింద‌న్న సామ్నా.. ఆర్థిక పురోగ‌తిని ఈ నిర్ణ‌యం భారీగా దెబ్బ తీసింద‌న్నారు. ధ‌ర‌లు పెరిగాయ‌ని.. వ్యాపారాలు దెబ్బ తిన్న‌ట్లుగా త‌న అభిప్రాయాన్ని వెల్ల‌డించింది.

శివసేన అధికార పత్రిక సామ్న సంపాదకీయంలో డీమానిటైజేషన్‌ వైఫల్యాన్ని ఎత్తిచూపుతూ కథనం ప్రచురించింది. డిపాజిట్ కానీ 1 శాతం నల్లధనం కాదని, బహుశా బ్యాంకు క్యూలో నిలుచునే ఓపిక లేకనే సామాన్యులు ఆ డబ్బును వదిలేసి ఉంటారని తెలిపింది. నిజంగా నల్లధనం ఎవరైతే కలిగి ఉన్నారో వాళ్ల మీద నోట్‌ బందీ(నోట్ల రద్దు) ఎలాంటి ప్రభావం చూపలేకపోయిందని పేర్కొంది. సుమారు 26,000 కోట్ల ధనం బ్యాంకుల్లో డిపాజిట్ కాలేదని, పైగా కొత్త నోట్ల ముద్రణ పేరిట మరో 21,000 కోట్లను అదనంగా వృథా చేశారని కేంద్రంపై విమర్శలు గుప్పించింది. మ‌ధ్య త‌ర‌గ‌తిని తీవ్రంగా క‌ష్ట‌పెట్టిన బీజేపీ.. పెద్ద‌నోట్ల ర‌ద్దు నిర్ణ‌యంతో ప్ర‌జ‌ల‌ను ప్ర‌లోభ పెట్టి వ‌రుస ఎన్నిక‌ల్లో విజ‌యం సాధిస్తుందంటూ విమ‌ర్శించారు. రాజ‌కీయాల‌కు అతీతంగా ఈ విష‌యాన్ని మాట్లాడుకున్నా.. చెలామ‌ణిలో ఉన్న మొత్తంలో 99 శాతం తిరిగి బ్యాంకుల్లోకి వ‌చ్చేయ‌టం అంటే.. పెద్ద నోట్ల ర‌ద్దు కార‌ణంగా లాభం కంటే న‌ష్ట‌మ‌నే చెప్పాలి. మొత్తంగా చూస్తే.. ఈ ఎపిసోడ్ లో మోడీ స‌ర్కారు ల‌బ్థి చెందితే.. ఆ ప్ర‌భుత్వాన్ని న‌మ్మినందుకు దేశ ప్ర‌జ‌లు భారీగానే మోస‌గించ‌బ‌డ్డార‌న్న అభిప్రాయాన్ని ప‌లువురు వ్య‌క్తం చేస్తుండటం గ‌మ‌నార్హం.