Begin typing your search above and press return to search.
టీ మంత్రికి నేరుగా కోటి ఆఫర్ ఇచ్చాడు
By: Tupaki Desk | 5 Sep 2018 8:37 AM GMTఒక ఉద్యోగి.. ఒక మంత్రి దగ్గరకు వెళ్లి డైరెక్ట్ గా డీల్ మాట్లాడటం సాధ్యమేనా? అంటే.. నో అనేస్తారు. కానీ.. అంతటి బరి తెగింపునకు పాల్పడ్డాడో అధికారి. ప్రస్తుతం సంచలనం మారిన ఈ ఉదంతం చూస్తే.. తెలంగాణలో అవినీతి లేదని చెప్పే ముఖ్యమంత్రి కేసీఆర్ మాటల్లో డొల్లతనం కొట్టొచ్చినట్లు కనిపిస్తుందని చెప్పక తప్పదు. ఇంతకూ జరిగిందేమంటే..
ఆరోగ్యాన్ని కాపాడే శాఖలో జిల్లా స్థాయి అధికారి అతడు. రాష్ట్ర స్థాయిలోని కీలక పోస్టుపై కన్నేశాడు. ఎలా అయినా సరే ఆ సీటును సొంతం చేసుకోవాలనుకున్నాడు. దాని కోసం దారులు వెతికాడు. రాష్ట్ర స్థాయి సీటుకోసం కన్నేసి ఉద్యోగి మామూలోడు కాదు. పె..ద్ద వసూల్ రాజాగా పేరుంది.అతగాడి తీరుతో అతడు పని చేసే జిల్లాకు చెందిన మంత్రి సదరు అధికారిపై చర్యలు తీసుకోవాలంటూ నెత్తి నోరు కొట్టుకున్నా ఫలితం గుండు సున్నా. అంటే.. మంత్రి చెప్పే మాటలు సైతం ఉన్నతాధికారులు పట్టించుకునేంత స్థాయిలో అతగాడికి లింకులు ఉన్నాయి.
అంతేనా.. ఒకవేసారి ఒక మంత్రి బందువుకు సంబంధించిన పని కోసం సదరు అధికారి వద్దకు వెళితే.. ఎప్పటిలానే తన రేటు చెప్పేశాడు. దానికి మంత్రి నుంచి ఫోన్ వస్తే.. మీకు సంబంధించిన వ్యక్తి కాబట్టి మీకు స్పెషల్ డిస్కౌంట్ ఇస్తానని చెప్పటంతో సదరు మంత్రికి దిమ్మ తిరిగిపోయిందట. ఇలా.. ఈ అధికారి చిన్నెల గురించి కథలు.. కథలుగా చెబుతుంటారు.
ఇలాంటి ఈ అధికారి తాజాగా తాను కోరుకున్న రాష్ట్ర స్థాయి సీటు కోసం మంత్రి వద్దకు నేరుగా వెళ్లాడట. తన అవసరాన్ని చెప్పి.. ఫేవర్ చేమని చెప్పటమే కాదు.. కోటి రూపాయిల డీల్ ను మంత్రి ముఖానే చెప్పేశాడట. దీంతో ఒక్కసారి షాక్ తిన్న సదరు మంత్రి బిత్తరపోయినట్లు చెబుతున్నారు.
ఆ పై మండిపోయి.. సదరు అధికారిపై చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేశారు. నాలుగు రోజుల క్రితం సదరు ఉద్యోగిని అప్రాధాన్యత పోస్టుకు బదిలీ వేటు వేశారు. అయితే.. మాత్రం అయ్యగారి హడావుడి తగ్గే అవకాశం ఉండే అవకాశం లేదంటున్నారు. ఏమైనా.. మంత్రికే కోటి ఆఫర్ ఇచ్చి షాకిచ్చిన వైనం రోటీన్ కు భిన్నంగా లేదు?