Begin typing your search above and press return to search.
బ్యూరోక్రసీలో చంద్రబాబుపై పెరుగుతున్న విద్వేషం
By: Tupaki Desk | 11 April 2016 5:30 PM GMTతెలుగుదేశం పార్టీ ఈదఫా అధికారంలోకి వచ్చిన తర్వాత... ముఖ్యమంత్రి స్వయంగా తాను ఇప్పుడు 'మారినచంద్రబాబును' అని ప్రకటించుకున్నారు. అది విన్న అందరూ నిజమే కాబోలు అనుకున్నారు. కానీ కాలక్రమంలో ఆయనలోని 'పాత చంద్రబాబు' నిదుర మేల్కొంటున్నట్లుగా కనిపిస్తోంది. పాత చంద్రబాబు పోకడలు.. ఆయన ప్రభుత్వం పాత తరహాలోనే తిరిగి ఒక ముద్రను వేయబోతున్నాయి. 2004లో ఎలాంటి పరిస్థితుల్లో ఉద్యోగ వర్గాల్లో ప్రత్యేకించి బ్యూరోక్రసీలో పెల్లుబికిన అసంతృప్తి వలన చంద్రబాబునాయుడు పదవీచ్యుతుడు కావాల్సి వచ్చిందో.. ఇప్పుడు ఇంచుమించు కేవలం రెండేళ్ల పాలనకాలంలోనే అదే తరహా అసంతృప్తి రగులుతున్నట్లుగా క్షేత్రస్థాయి వాస్తవాలు తెలియజేస్తున్నాయి.
క్షేత్రస్థ్థాయిలో అధికారులు తమ సహజమైన ధోరణిలో పనిచేసుకుంటూ పోతారు. కించిత్ అవినీతి మన సమాజంలో సహజంగా మారిపోయినప్పటికీ.. పైసా ఆశించకుండా ప్రజల పనులు చేసిపెట్టే అధికారులు కూడా మనకు పుష్కలంగానే ఉన్నారు. అయితే ఇప్పుడు తెలుగుదేశం ఈ దఫా గద్దె ఎక్కిన తర్వాత.. చంద్రబాబునాయుడు ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాల పుణ్యమాని పార్టీ నాయకులు, కార్యకర్తలు అధికారుల పనిలో జోక్యం చేసుకోవడం అనేది పెరిగిపోయింది. జోక్యం ఎంతగా ముదిరిపోతున్నదంటే.. అవినీతి ఇష్టంలేని అధికారులు కూడా.. నాయకుల ఒత్తిడికి అలాంటి పనులు చేయక తప్పడం లేదు. అంతో ఇంతో అవినీతి పరులు కూడా.. మితిమీరిన రాజకీయ జోక్యాన్ని సహించలేకపోతున్నారు. తమ నోటికాడ కూడు ఈ పార్టీ నాయకులు వచ్చి కాజేయడం మాత్రమే కాదు, ప్రజల దృష్టిలో తమకు విలువ లేకుండా చేస్తున్నారని, తమ పనిలో మితిమీరి వేలు పెడుతున్నారని ఆవేదనచెందుతున్నారు.
ఏతావతా.. పార్టీ వైఖరిపై అధికార వర్గాల్లో అసంతృప్తి బాగా ప్రబలుతున్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. 2004లో ఇదే పరిస్థితి ఉండేది. తన ఇమేజిని బూస్ట్ చేసే అతిగొప్ప నినాదంలాగా చంద్రబాబునాయుడు 'నేను నిద్రపోను.. మిమ్మల్ని నిద్రపోనివ్వను' అని అధికారుల్ని బెదిరిస్తూ.. జనంలో ఇమేజి సంపాదించాననుకున్నారు. కానీ అధికారుల్లో వ్యతిరేకత మూటగట్టుకున్నారు. ఫలితం.. ప్రభుత్వం కుప్పకూలింది. ఇప్పటి ప్రభుత్వంలో అధికారులకు నిద్రలేకుండా చేయడానికి ఊరికొకరు తయారయ్యారని పలువురు ఆరోపిస్తున్నారు. చంద్రబాబు గనుక మేలుకుని ఈ పరిస్థితిని చక్కదిద్దుకోకుంటే.. మళ్లీ వచ్చే ఎన్నికలకు చేదు ఫలితాలను చూడాల్సి ఉంటుందని పలువురు అంచనా వేస్తున్నారు.