Begin typing your search above and press return to search.
న్యూఇయర్ లో జీతాలు పెరుగుతాయట..?
By: Tupaki Desk | 14 Dec 2015 5:42 AM GMTమరో మూడు వారాల్లో కొత్త సంవత్సరం రానున్న సంగతి తెలిసిందే. కొత్త సంవత్సరంలో వచ్చే మార్పులకు సంబంధించిన ఆసక్తికర కోణం ఒకటి తాజాగా ఒక సర్వే వెల్లడించింది. ఉద్యోగాలు చేసుకునే కోట్లాది మంది మనసుల్ని దోచే ఈ వార్తాంశం ఏమిటంటే.. వచ్చే ఏడాది ఉద్యోగుల జీతాలు భారీగా పెరిగే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు పెరిగిన నేపథ్యంలో.. ప్రైవేటు ఉద్యోగుల జీతాలు కొత్త సంవత్సరంలో పెరగటం ఫక్కా అని చెబుతున్నారు. ఈ ఏడాది ఇప్పటికే 10శాతం మేరకు జీతాలు పెరిగాయని.. వచ్చే ఏడాది మరింత పెరుగుతాయన్న అంచనాను వేస్తున్నారు.
ప్రభుత్వ రంగంలో పని చేస్తున్న ఉద్యోగులకు జీతాలు పెంచాలంటూ ఏడో వేతన సంఘం సిఫార్పు చేసిన నేపథ్యంలో.. ప్రైవేటు సంస్థల్లోని ఉద్యోగులకు వచ్చే ఏడాది 10 నుంచి 30 శాతం చొప్పున పెరగటం ఖాయమంటున్నారు. 2016లో సగటున 12 నుంచి 16 శాతం మధ్యన జీతాలు పెరిగే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. జీతాలు పెరిగే అవకాశం ఉన్న రంగాల విషయానికి వస్తే.. ఈ కామర్స్.. ఇంటర్నెట్ సంబంధిత రంగాలు.. తయారీ రంగాలతో పాటు.. ఐటీ పరిశ్రమల్లో వేతనాలు భారీగా పెంచే వీలుందని చెబుతున్నారు. కొత్త సంవత్సరం గురించి కోటి ఆశలతో ఎదురుచూసే వారికి తాజా అధ్యయం హ్యాపీగా ఉంచటంతో పాటు.. కొత్త ఆశల్ని మరింతగా పెంచుతుందని చెప్పక తప్పదు.