Begin typing your search above and press return to search.

ఏపీ కాఫీకి జియో ట్యాగ్‌.. లాభం ఏమిటి?

By:  Tupaki Desk   |   30 March 2019 5:06 AM GMT
ఏపీ కాఫీకి జియో ట్యాగ్‌.. లాభం ఏమిటి?
X
ఏపీకి మ‌రో గుర్తింపు ల‌భించింది. విశాఖ జిల్లాలోని అర‌కు లోయ‌లో సాగు చేస్తున్న కాఫీకి అరుదైన గుర్తింపు ల‌భించింది.

అర‌కు కాఫీతో పాటు దేశంలోని మ‌రో నాలుగు ప్రాంతాల్లో పండించే కాఫీకి జియో ట్యాగ్ గుర్తింపు ల‌భించింది. తాజా గుర్తింపు కార‌ణంగా ప్ర‌పంచవ్యాప్తంగా ఉండే కాఫీ విప‌ణిలో అర‌కు కాఫీ పేరుకు కొత్త ఇమేజ్ రానుంది.

జాగ్ర‌ఫిక‌ల్ ఇండికేష‌న్ సింఫుల్ గా చెప్పాలంటే జీఐ పేరుతో ఇచ్చే ఈ గుర్తింపుతో అర‌కు కాఫీ ప‌రిధి విస్త‌రించే వీలుంది. అంతేకాదు.. ఒకసారి జీఐ ట్యాగ్ ల‌భిస్తే.. ఇత‌ర ఉత్ప‌త్తిదారులు ఎవ‌రూ మార్కెట్లో మ‌న కాఫీ పేరును దుర్వినియోగం చేసే వీలు ఉండ‌దు. అంతేకాదు.. పంట‌ను పండించే వారికి మంచి ధ‌ర ల‌భించే వీలుంది.

తాజాగా కేంద్రం ప్ర‌క‌టించిన జీఐ ట్యాగ్ అర‌కులోని కాఫీ పంట‌తో పాటు.. క‌ర్ణాట‌క‌లోని కూర్గ్‌.. చిక్ మ‌గ‌ళూరు.. బాబా బూద‌న్ గిరుల‌కు చెందిన అరేబికా ర‌కాల‌కు.. వాయ‌నాడ్ రోబ‌స్టా ర‌కం కాఫీకి గుర్తింపు ల‌భించిన‌ట్లే. ఏపీలోని అర‌కులో గిరిజ‌నులు సేంద్రియ విధానంలో కాఫీ పంట‌ను పండిస్తున్నారు. ఇప్ప‌టికే దీని రుచికి ప్ర‌త్యేక గుర్తింపు ల‌భించింది. తాజాగా ల‌భించిన గుర్తింపుతో తెలుగు కాఫీ క‌మ్మ‌ద‌నం ప్ర‌పంచానికి స‌రికొత్త అనుభూతిని క‌లిగించ‌టం ఖాయ‌మ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.