Begin typing your search above and press return to search.
రూ.300 అన్ని పండ్లు.. అది కూడా 73307 33212కు కాల్ చేస్తే చాలు
By: Tupaki Desk | 13 April 2020 4:45 AM GMTమీ సెల్ ఫోన్ లో 73307 33212 నెంబరు అర్జెంట్ గా సేవ్ చేసుకోండి. లాక్ డౌన్ వేళ.. తాజా పండ్లు.. కూరగాయలు తినటం ద్వారా రోగనిరోధక శక్తిని పెంచుకునే వీలుంది. ఎవరికి వారు ఇళ్లల్లోనే ఉండిపోతున్న వేళ.. పండ్లు కొనుగోలు చేయటానికి రోడ్ల మీదకు రాకుండా చేసేందుకు తెలంగాణ వ్యవసాయ మార్కెటింగ్ శాఖ వినూత్న కార్యక్రమాన్ని తీసుకొచ్చింది.
హైదరాబాద్ మహానగరంలోని కాలనీలు.. అపార్టుమెంట్లు.. గేటెడ్ కమ్యూనిటీల వారు ఎవరైనా సరే తాజా పండ్లు కావాలంటే తమకు ఫోన్ చేస్తే చాలు ఇంటికి తెచ్చి ఇస్తామంటున్నారు. కాకుంటే.. ఆ ఆర్డర్ 30 పాకెట్లుగా ఉండాలన్న రూల్ పెట్టారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమంటే రూ.300 మొత్తానికి భారీ ఎత్తున పండ్లు లభించేలా డిజైన్ చేశారు.
రూ.300లకు అందించే ప్యాక్ లో ఉండే పండ్ల రకాల్ని చూస్తే.. మామిడికాయలు 3.5కేజీలు.. బొప్పాయి 3 కేజీలు.. సపోటా కేజీ.. బత్తాయి 2.5కేజీలు.. నిమ్మకాయలు 12.. పుచ్చకాయలు నాలుగు కేజీలు ఉంటాయి. అంటే.. మొత్తం 22 కేజీల పండ్లు రూ.300లకే ఇంటికి తెచ్చేలా మార్కెటింగ్ శాఖ ప్లాన్ చేస్తుంది. బహిరంగ మార్కెట్లో ఇవే పండ్లను తక్కువలో తక్కువ రూ. వెయ్యి వరకూ వసూలు చేస్తుంటారు. అలాంటిది తక్కువ మొత్తానికి తాజా పండ్లను భారీగా తెచ్చిచ్చే ఈ అవకాశాన్ని అస్సలు మిస్ కాకూడదు. మీరేమంటారు?