Begin typing your search above and press return to search.

లాక్ డౌన్ ఎందుకు పొడిగించాలి? ఎత్తేస్తే ప్రమాదాలేంటి?

By:  Tupaki Desk   |   10 April 2020 5:30 PM GMT
లాక్ డౌన్ ఎందుకు పొడిగించాలి? ఎత్తేస్తే ప్రమాదాలేంటి?
X
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి భారత ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం 21 రోజుల పాటు దేశంలో 21 రోజుల లాక్ డౌన్ పొడిగాస్తారా ? లేదా అన్నది ఉత్కంఠగా మారింది. ఏప్రిల్ 14 తర్వాత లాక్ డౌన్ పొడిగిస్తే పర్యవసనాలేంటనే దానిపై చర్చ జరుగుతోంది.

130 కోట్ల జనాభా.. 2.9 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ ఉన్న దేశంలో ప్రభుత్వం సాహసోపేతంగా లాక్ డౌన్ విధించింది. అన్నీ బంద్ అయిపోయి వేల కోట్ల నష్టం వస్తోంది. ఇప్పటికీ దేశంలో 5వేల మందికి పైగా కరోనా బారిన పడగా.. 150మందికి పైగా మరణించారు. రోజు రోజుకు కేసులు పెరుగుతూనే ఉన్నాయి.

సామాజిక వ్యాప్తిలోకి వైరస్ రావడంతో కేసులు పెరుగుతున్నాయి. కొన్ని రెడ్ జోన్లు - బఫర్ జోన్లను ప్రకటించారు. అయితే ఇంకా వేలమందికి కరోనా టెస్టులు చేయలేదు. అంత సామర్త్యం భారత్ వద్ల లేదు. లక్షణాలున్న వారిని.. అనుమానితులను గుర్తించి మాత్రమే పరీక్షలు చేస్తున్నారు..

ప్రస్తుతం దేశంలో 718 జిల్లాల్లో 250కు పైగా జిల్లాల్లో ఇన్ఫెక్షన్ సోకినట్లు తెలిసింది. ఎక్కువగా కరోనా ఏడు రాష్ట్రాల్లోని ఉంది. ఆ రాష్ట్రాలు లాక్ డౌన్ పొడిగిస్తే సరిపోతుందంన్న మాట వినిపిస్తోంది. ప్రధానంగా ఢిల్లీ - మహారాష్ట్ర - తమిళనాడు సహా ఆరు రాష్ట్రాల్లో లాక్ డౌన్ విధిస్తే సరిపోతుందన్న ఆలోచన ప్రభుత్వంలో ఉందట..

లాక్ డౌన్ వల్ల ఇప్పటికే దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. వైరస్ వ్యాప్తి చెందిన హాట్ స్పాట్లన్నీ దేశ ఆర్థిక వ్యవస్థకి అధిక ఆదాయాన్ని సమకూర్చేవే..

దేశంలో 3 వంతుల పన్ను వసూళ్లు మహారాష్ట్ర రాజధాని ముంబైలో జరుగుతాయి. ఈ నగరంలో ఇప్పటికే 500 మందికి పైగా కరోనా వైరస్ పడినవారున్నారు. 45 మరణాలు చోటుచేసుకున్నాయి. ఈ సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ హాట్ స్పాట్ లన్నీ దేశ ఉత్పత్తి రంగంలో ఉండడంతో మరికొంత కాలం లాక్ డౌన్ ఖాయం. అదే జరిగితే దేశ స్థూల ఉత్పత్తి రంగం కుదేలవుతుంది.

లాక్ డౌన్ తర్వాత నిరుద్యోగ శాతం 20శాతంపైనే పెరిగిందని ఇండియన్ ఎకానమీ నివేదికలో తేలింది.

ప్రస్తుతం ప్రజల బతకడానికి అవసరమయ్యే వ్యవసాయం మీదనే దృష్టి పెట్టి ఆహార ఉత్పత్తి సరఫరా పైనే ప్రభుత్వం దృష్టి సారించాలని ఆర్థిక వేత్తలు సూచిస్తున్నారు. పంటను తీసి కోసి కొత్త పంట వేయడానికి అవకాశం కల్పించాలని చెబుతున్నారు.

లాక్ డౌన్ ఒకేసారి కాకుండా తీవ్రత ఉన్న హాట్ స్పాట్లలో విడతల వారీగా సడలిస్తేనే బెటర్ అని ప్రభుత్వ సలహాదారు ఎస్ కే సరిన్ సూచిస్తున్నారు.

అధిక జనాభా - దేశ విస్తీర్ణం - బలహీన ప్రజారోగ్యం ఉన్న భారత్ లో లాక్ డౌన్ సడలింపుతో చాలా ప్రమాదం ఉంటుంది. లాక్ డౌన్ సడలిస్తే కూలీలు ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వివిధ ప్రాంతాలకు వెళతారు. అందరూ రోడ్లపైకి వస్తే కరోనా ఉంటే మరిన్ని కేసులు, దేశ వినాశనం ఖాయం. ఈ ప్రక్రియలో వైరస్ మరింత విస్తరిస్తుంది. అందుకే ఒకేసారి కాకుండా వైరస్ వ్యాప్తిని బట్టి నెమ్మదిగా కొన్ని ప్రాంతాలకు అనుగుణంగా లాక్ డౌన్ ఎత్తివేస్తే బెటర్ అని నిపుణులు అంటున్నారు.