Begin typing your search above and press return to search.
త్వరలో మీ నెంబరు ‘‘11’’ అంకెలు కానుంది
By: Tupaki Desk | 12 Oct 2016 9:43 AM GMTదాదాపు 13 ఏళ్ల క్రితం ఫోన్ నెంబరు అంటే 9 అంకెల్లో ఉండేది. కానీ.. సెల్ ప్రభంజనంతో ఫోన్ నెంబరు10 అంకెలకు చేరుకుంది. అప్పట్లో చేసిన మార్పుతో దాదాపు 30 ఏళ్ల వరకూ ఫోన్ నెంబరు అంకెను మార్చాల్సిన అవసరం ఉండదని భావించారు. అయితే.. 134 కోట్ల భారతావనిలో ఫోన్ నెంబరు అంకెల్ని మార్చేయాల్సిన రోజు దగ్గర్లోకి వచ్చేసింది. ఫోన్ల వినియోగం భారీగా పెరగటం.. ఒక్కొక్కరు రెండేసి నెంబర్లు చొప్పున వాడుతున్న నేపథ్యంలో.. ఇప్పడున్న 10 అంకెల నెంబరుకు అదనంగా మరో నెంబరు జత చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఇప్పుడున్న పరిస్థితుల్లో పది అంకెల నెంబరు లభ్యత తగ్గిపోవటం.. కొత్త నెంబర్ల వినియోగం రోజురోజుకి పెరిగిపోతుండటంతో 11 అంకెల నెంబరింగ్ వ్యవస్థను తీసుకురావాలని టెలికమ్యూనికేషన్ శాఖ నిర్ణయించింది. తాము తీసుకున్న నిర్ణయాన్ని త్వరలోనే అమలు చేయనున్నట్లు చెబుతున్నారు. దీనికి సంబంధించిన అధికారిక సమాచారం బయటకు రాలేదు.
అయితే.. రానున్న కొద్ది రోజుల్లోనే ఇప్పుడున్న పది నెంబర్ల స్థానే.. 11 అంకెలతో కూడిన నెంబర్ ను అమల్లోకి తీసుకురానున్నట్లు చెబుతున్నారు. సో.. సెల్ లోని ఫోన్ నెంబర్లకు మరో అంకెను అదనంగా చేర్చుకోవటం పెద్ద ప్రయాసే. మరి.. దీన్ని అధిగమించేందుకు కొత్త యాప్ వచ్చేసి.. యాప్ ను ఇన్ స్టాల్ చేసుకున్న వెంటనే.. ఫోన్ బుక్ లోని నెంబర్లు అన్నీ ఒక్కసారిగా ప్రభుత్వం పేర్కొన్న ఒక నెంబరును అదనంగా జత చేసే సౌకర్యం వస్తే బాగుండేమో కదూ..?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/