Begin typing your search above and press return to search.

ఆర్నెళ్లలో కరిగిపోయే నోట్లు..మోడీ నెక్స్టు స్టెప్

By:  Tupaki Desk   |   23 Dec 2016 11:00 AM GMT
ఆర్నెళ్లలో కరిగిపోయే నోట్లు..మోడీ నెక్స్టు స్టెప్
X
నల్లధనాన్ని నియంత్రించాలన్న మోడీ నిర్ణయం కాస్తా క్యాష్ లెస్ మనీ ఇంప్లిమెంటేషన్ సాధనంగా మిగిలిపోయింది. రద్దు చేసిన రూ.500 - రూ.1000 నోట్లలో సుమారు 14.5 లక్షల కోట్ల విలువైనవి మళ్లీ డిపాజిట్ల రూపంలో బ్యాంకింగ్ వ్యవస్థలోకి వచ్చేశాయి. రద్దు నాటికి దేశంలో చలామనీలో.. లేదంటే నల్లధనంగా మూలుగుతున్న డబ్బు విలువకు ఇది దాదాపు సమానం. అంటే... మోడీ నిర్ణయంతో నల్లధనం ఏమీ బయటపడలేదన్నమాటే. దీంతో ఆదాయపు పన్ను శాఖ - ఈడీ దాడులతో మాత్రమే కొద్దిమొత్తంలో బయటకు లాగుతున్నారు. ఈమాత్రం దానికి ఇంత పెద్ద నిర్ణయం అవసరమే లేదు.. ఆ దాడులేవో ముందే చేయొచ్చు.

దీంతో ప్రభుత్వం కొత్తగా మరో నిర్ణయం ప్రకటించబోతున్నట్లుగా తెలుస్తోంది. రద్దు చేసిన పాత నోట్ల స్థానంలో తెచ్చిన రూ.2 వేల నోట్లనూ చలమణీలోంచి తీసేస్తారని... కొత్తగా వెయ్యి - 500 నోట్ల అవసరం లేకుండా చేస్తారని భావిస్తున్నారు. అర్థక్రాంతి సంస్థ వ్యవస్థాపకుడు అనిల్ బోకిల్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. డీమానిటైజేషన్ ముఖ్యంగా నకిలీ నోట్ల ఏరివేత - ఉగ్రవాద నిరోధానికి బాగా తోడ్పడుతుందని ఆయన చెబుతున్నారు.

కాగా.. ఇదే సమయంలో మరో రకం నోట్ల గురించి కూడా వార్తలొస్తున్నాయి. నోట్లకు ఎక్స్పయిరీ డేట్ ఉంటుందని.. అంటే దానిపై అలాంటి తేదీ ఏమీ ముద్రించకపోయినా తయారీ తేదీ ఉంటుందని.. అక్కడి ఆర్నెళ్లలో దాని కాలపరిమితి ముగిసిపోయేలా కొత్త నోట్లు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఆర్నెళ్ల తరువాత వాటికవే కరిగిపోతాయట. నేషనల్ సైన్స్ రీసెర్చి మిషన్ ఈ టెక్నాలజీ తయారుచేయగా ఆర్బీఐ దీన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మెల్టింగ్ నోట్లుగా పిలుస్తున్న ఇవి కనుక నిజంగానే చలమణీలోకి వస్తే ఎవరూ కట్టలు కట్టలుగా నోట్లు దాచుకోవడం కుదరదు. అలా దాచుకున్నా ఆర్నెళ్ల తరువాత అంతా కరిగిపోతుంది. సో... బ్యాంకుల్లో వేసుకోవాల్సిందే. అంటే లెక్కకు దొరుకుతుందన్నమాట. మరి ఇది నిజమేనా.. కార్యరూపం దాలుస్తుందా అన్నది చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/