Begin typing your search above and press return to search.
‘రద్దు’ ఆగ్రహానికి చెక్ చెప్పే స్వీట్ న్యూస్
By: Tupaki Desk | 20 Dec 2016 4:43 AM GMTపెద్దనోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయంతో దేశంలో ఎలాంటి పరిస్థితి నెలకొందో అందరికి తెలిసిందే. వారం.. పది రోజుల్లో అంతా సెటిల్ అయిపోతుందని అనుకున్నవారి అంచనాలు అడ్డంగా ఫెయిల్ కావటమేకాదు.. నేటికీ కరెన్సీ కష్టాలతో సామాన్యుడు కిందామీదా పడుతున్న పరిస్థితి. పెద్దనోట్ల రద్దును ప్రకటించి ఆరు వారాలు దాటిన తర్వాత కూడా నేటికీ తెరుచుకోని ఏటీఎంలు.. విత్ డ్రా కోసం బ్యాంకు ఎదుట క్యూ కట్టటం.. గంటల కొద్దీ వెయిట్ చేసిన తర్వాత అవకాశం వచ్చినప్పటికీ రూ.3 వేలనుంచి రూ.4 వేల మధ్యన మాత్రమే క్యాష్ ఇవ్వటం లాంటివి ప్రజల్ని తీవ్ర అసంతృప్తికి గురి చేస్తున్నాయి.
పెద్దనోట్ల రద్దు నిర్ణయంతో నల్లకుబేరులకు చెక్ పెట్టినట్లు అవుతుందని.. పోగు పడిన నల్లధనం భారీగా ప్రభుత్వానికి దాఖలు అవుతుందని అంచనాలు పెద్దగా వర్క్ వుట్ కాలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రద్దు నిర్ణయంతో అంతులేని రాజకీయ ప్రయోజనాన్ని ఆశిస్తున్న మోడీ సర్కారుకు.. ప్రజల్లో పెల్లుబికుతున్న అసంతృప్తి నేపథ్యంలో.. ఒక కీలక నిర్ణయాన్ని తీసుకుంటుదన్న మాట వినిపిస్తోంది.
పెద్దనోట్ల రద్దుతో వచ్చి పడ్డ ఆగ్రహాన్ని.. ఒకేఒక్క నిర్ణయంతో తీసేసేలా ప్రకటనను వెలువడుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పెద్దనోట్ల రద్దుతో సంచలన నిర్ణయాన్ని తీసుకున్న మోడీ సర్కారు.. కరెన్సీ వినియోగంపై అప్రకటిత పరిమితులు విధించి.. వీలైనంత వరకూ క్యాష్ లెస్ లావాదేవీలకు ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో.. పన్ను ఆదాయం భారీగా పెరుగుతుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి.
ఈ పెరిగే ఆదాయంతో.. ఆదాయపన్ను మీద ఇప్పటివరకూ బాదేస్తున్న పన్నుపోటును భారీగా తగ్గించాలన్న నిర్ణయానికి మోడీ సర్కారు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడున్న చట్టాల ప్రకారం ఆదాయపన్ను మినహాయింపు ఏడాదికి రూ.2.5లక్షల వరకే ఉంది. దాన్ని తాజా బడ్జెట్ లో రూ.4లక్షల వరకూ పన్నుపోటు లేకుండా నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది. అంటే.. నెలకు రూ.33వేల వరకూ జీతం వచ్చే వారు ఆదాయపన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. అదే సమయంలో ప్రస్తుతం అమలవుతున్న విధానం ప్రకారం రూ.2.5లక్షల నుంచిరూ.5 లక్షల ఆదాయం ఉన్న వారు తమ ఆదాయంలో 10 శాతాన్ని ఐటీ ట్యాక్స్ కింద పే చేస్తున్నారు. ఈ పరిమితిని రూ.4 లక్షలనుంచి రూ.10 లక్షలకు పెంచే అవకాశం ఉందని చెబుతున్నారు.
అదే సమయంలో రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు ఇప్పుడు 20 శాతం ఐటీ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. దీన్ని రూ.10 నుంచి రూ.15 లక్షల వార్షిక ఆదాయంపై 15 శాతానికి తగ్గించాలని.. అదే సమయంలో రూ.10లక్షల వార్షిక ఆదాయం దాటితే వసూలు చేస్తున్న 30 శాతం ఐటీ ట్యాక్స్ ను సవరిస్తూ.. రూ. 20 లక్షల ఆదాయం దాటితేనే 30 శాతం ఆదాయపన్ను విధించాలన్న నిర్ణయాన్నిప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు. అదే జరిగితే.. పెద్దనోట్ల రద్దు మీద వ్యక్తమవుతున్న అసంతృప్తి ఒంటి చేత్తో తీసేసినట్లు అవుతుందనటంలో సందేహం లేదు. మరీ.. కీలక నిర్ణయాన్ని మోడీ సర్కారు ఎప్పుడు అమలు చేస్తుందన్నదే అసలు ప్రశ్న.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/