Begin typing your search above and press return to search.
మూడు ఐడియాలు.. బాబుతో మొట్టికాయలు
By: Tupaki Desk | 20 April 2017 12:27 PM GMTచంద్రబాబు అంటే హైటెక్ సీఎం.. మంచివో చెడ్డవో ఐడియాల పుట్ట. అలాంటి చంద్రబాబుకే ఐడియాలు ఇస్తే ఎలా ఉంటుంది..? తాతకు దగ్గులు నేర్పినట్లవుతుంది. తాజాగా ఏపీ గవర్నమెంటులో ఓ కీలక అధికారి అలాంటి ప్రయత్నమే చేసి చంద్రబాబు నుంచి ఫుల్లుగా చీవాట్లు తిన్నారట.
గ్రామీణ ప్రాంతాల్లో అమెరికా టైపు నిర్మాణాలు చేపట్టి కమ్యూనిటీ హాల్లుగా ఉపయోగించాలని.. గిరిజన ప్రాంతాల్లో కొండల మీద ట్యాంకులు కట్టించాలని ఆ అధికారి సూచించడంతో చంద్రబాబుకు ఎక్కడలేని కోపం వచ్చిందట. ఇప్పటికే గ్రామాల్లో ఎందుకూ పనికి రాకుండా ఉన్న కమ్యూనిటీ హాళ్లను కొత్త రూపంలో కట్టవచ్చునని చెబుతావా...? డబ్బులేమైనా చెట్లకు కాస్తున్నాయా అంటూ చంద్రబాబు చెడామడా తిట్టారట.
అయినా, ఆ అధికారి అక్కడితో ఆగకుండా మరో ఐడియా కూడా ఇచ్చారట. వెనుకబడిన తరుగతులకు కేటాయించిన నిధులు వినియోగంలోకి రావడంలేదని, బ్యాంకులు కూడా వారికి రుణాలు మంజూరు చేయటం లేదని, దాని వలన ఆ నిధులన్నీ నిరుపయోగంగా ఉండిపోతున్నాయని ముఖ్యమంత్రికి చెప్పారట. దానికి పరిష్కార మార్గం కూడా చెబుతూ ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీని నేరుగా నగదు బదిలీ మాదిరిగా బీసీలకు ఇచ్చేయాలన్నారట. దీంతో చంద్రబాబు మరోసారి ఫైరయ్యారట. ఎక్కడైనా నగదు నేరుగా ఇస్తామా అని నిలదీశారని తెలుస్తోంది.
అప్పటికీ ఆగని ఆయన కొండ ప్రాంతాల్లో ఉండే గిరిజనులకు సురక్షిత మంచినీరు అందించేందుకు కొండల పై మంచినీళ్ల ట్యాంకులు కట్టి - అక్కడి నుంచి నీళ్లను పర్వత ప్రాంతాల్లో ఉండే గిరిజనులకు సరఫరా చేస్తే బాగుంటుందని, ఇందుకో ఏజెన్సీ ముందుకు వచ్చిందని సీఎంకు వివరించడంతో అక్కడే ఉన్న గ్రామీణ మంచి నీటి సరఫరా విభాగం అధికారులు, చంద్రబాబు కూడా క్లాస్ పీకారట.
ఇంతకీ ఆయన ఇలాంటి ఐడియాలు ఇవ్వడం వెనుక కారణం ఉందని చెబుతున్నారు. ఓ కన్సల్టెన్సీ వారు ఈ ప్రతిపాదనను తీసుకుని ఆ అధికారి వద్దకు వచ్చి అమెరికా స్టయిల్లో కడదామని కంప్యూటర్ గ్రాఫిక్స్ చూపించడంతో.. హైటెక్ భావనలున్న చంద్రబాబు ఆ గ్రాఫిక్సుకు పడిపోతారని భావించి ఆయన ఈ ప్రపోజల్సన్నీ పెట్టారట. చేస్తే తానే చేయాలి తప్ప ఇంకెవరూ చేయకూడదు, ఇంకెవరికీ క్రెడిట్ దక్కకూడదని భావించే చంద్రబాబు ఐడియా అనగానే విరుచుకుపడ్డారట.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/