Begin typing your search above and press return to search.
బాబు ఛాంబరే..కుర్చీ మాత్రం బాలయ్యదట!
By: Tupaki Desk | 25 Jan 2018 4:23 AM GMTముఖ్యమంత్రి బావమరిది కమ్ వియ్యంకుడైన బాలయ్య పవర్ ఎంతో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. బాబు విదేశీ పర్యటనలో ఉన్న.. బావ కమ్ సీఎం ఛాంబర్ ను వాడేసుకున్న వైనం సంచలనంగా మారింది. ఏపీ ముఖ్యమంత్రి సమీక్ష జరిపే ఛాంబర్లో బాలయ్య కూర్చోవటమే కాదు.. లేపాక్షి ఉత్సవాల ఏర్పాట్లపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
ఈ వ్యవహారం బయటకు రావటమే కాదు.. సంచలనంగా మారింది. సీఎం ఛాంబర్లో ఆయన కుర్చీలో కూర్చొని రివ్యూ మీటింగ్ ను నిర్వహించటంపై భారీ చర్చ మొదలైంది. బాబు ఊళ్లో లేని వేళ.. చోటు చేసుకున్న ఈ వైనంపై ఏపీ సచివాలయ అధికారులు ఇప్పుడు క్లారిటీ ఇచ్చే పనిలో పడ్డారు. బాబు రివ్యూ నిర్వహించే వెనుక బుద్దుడి ప్రతిమ ఉండటం.. బాలయ్య రివ్యూ మీటింగ్ కూడా అదే రీతిలో ఉండటం హాట్ టాపిక్ గా మారింది.
అయితే.. ఈ వివాదంపై ఏపీ అధికారులు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అదేమంటే.. బాలయ్య రివ్యూ నిర్వహించిన వేదిక ముఖ్యమంత్రి చంద్రబాబు ఉపయోగించేదే అయినప్పటికీ.. ఆయన కుర్చున్న కుర్చీ మాత్రం బాబుది కాదని చెబుతున్నారు. చంద్రబాబు కూర్చునే కుర్చీని పక్కకు జరిపేసి.. వేరే కుర్చీలో బాలయ్య కూర్చున్నారని చెబుతున్నారు.
అధికారుల మాట డ్యామేజ్ కంట్రోల్ మాదిరే ఉందన్న వాదన వినిపిస్తోంది. ముఖ్యమంత్రి రివ్యూ చేసే ఛాంబర్లో ఎమ్మెల్యే మాత్రమే అయిన బాలయ్య ఎలా వినియోగిస్తారని ప్రశ్నిస్తున్నారు. ముఖ్యమంత్రికి ఎంత బావ మరిది అయితే మాత్రం సీఎం ఛాంబర్ ను తన రివ్యూ మీటింగ్ కోసం వాడేస్తారు? అన్న ప్రశ్న వినిపిస్తోంది.
తనకు తోచినట్లు చేసే బాలయ్య తీరును ఈసారైనా చంద్రబాబు ప్రశ్నిస్తారా? అన్న అంశంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇప్పటివరకూ తన అభిమానుల విషయంలో వార్తల్లోకి ఎక్కే బాలయ్య.. తొలిసారి ఈ తరహా వివాదంలో చిక్కుకున్నారని చెప్పక తప్పదు. సీఎం ఛాంబర్ ను వాడేసిన బాలయ్య.. కుర్చీని మాత్రం పక్కన పెట్టేశారని చెబుతున్న సిబ్బంది మాటలు చూస్తే.. ఆ మధ్యన రజనీకాంత్ సూపర్ హిట్ మూవీలో.. అతను వేసుకున్న చొక్కా గురించి నన్నేమీ అడగొద్దన్న వైనం చప్పున గుర్తుకు రాక మానదు.