Begin typing your search above and press return to search.
ఆన్ లైన్లో ఆర్డర్ తో ఇంటికి పెట్రోల్.. డీజిల్
By: Tupaki Desk | 28 Sep 2017 5:23 AM GMTమారిన కాలానికి తగ్గట్లుగా వ్యాపారాల్ని మార్చేసుకోవటానికి మించింది లేదు. ప్రజల అవసరాలకు తగ్గట్లుగా నిర్ణయాలు తీసుకోవటం ద్వారా వారి మనసుల్ని దోచుకునే వీలుంది. తాజాగా అలాంటి పనే చేస్తోంది మోడీ సర్కారు. ప్రజలకు నేరుగా లబ్థి చేకూర్చే విషయంలో వెనుక ఉండే మోడీ సర్కారు.. కొన్ని విషయాల్లో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది.
పెట్రోల్ డీజిల్ మీద తనదైన స్టైల్లో బాదిపారేస్తున్న మోడీ సర్కారు.. ఎందుకిలా అంటూ దేశ ప్రజలు గగ్గోలు పెడుతున్నా కిమ్మనటం లేదు. అదే సమయంలో.. పెట్రోల్.. డీజిల్ కు సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు ఆ శాఖా మంత్రి ధరేంద్ర ప్రధాన్.
రానున్న కొద్దిరోజుల్లో ఎవరికి వారు తమకు అవసరమైన పెట్రోల్.. డీజిల్ కోసం పెట్రోల్ బంకుల వద్దకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఆన్ లైన్లో ఆర్డర్ చేస్తే.. ఇంటికే తీసుకొచ్చి డెలివరీ చేసే రీతిలో కొత్త విధానం ఒకటి అందుబాటులోకి రానుంది. పెట్రోలియం ఉత్పత్తుల్ని ఆన్ లైన్లోకి అందుబాటులోకి తెచ్చేలా తాము ప్రయత్నిస్తున్నట్లుగా కేంద్ర మంత్రి తాజాగా వెల్లడించారు.
దేశ వ్యాప్తంగా ఉన్న లక్ష పెట్రోల్ బంకుల ద్వారా నాలుగు కోట్ల మంది వినియోగదారులు పెట్రోల్ ఉత్పత్తుల్ని కొనుగోలు చేస్తున్నట్లు చెప్పిన ఆయన.. ఏటా పెట్రోల్.. డీజిల్ అమ్మకాలు దాదాపు రూ.6.5 లక్షల కోట్లుగా చెప్పారు. పెట్రోల్.. డీజిల్ ఇంటికే తీసుకొచ్చేలా కొత్త విధానాన్ని రూపొందిస్తున్నామని.. త్వరలోనే అందుబాటులోకి వస్తుందన్నారు. ఆన్ లైన్లోకి పెట్రోల్.. డీజిల్ అందుబాటులోకి రావటం బాగానే ఉన్నా.. దీంతో మరెన్ని కొత్త సమస్యలు తెర మీదకు వస్తాయో?