Begin typing your search above and press return to search.

క‌రోనాకు విరుగుడుగా అశ్వ‌గంధ: పరిశోధ‌న‌లకు భార‌త్ సిద్ధం

By:  Tupaki Desk   |   8 May 2020 5:30 PM GMT
క‌రోనాకు విరుగుడుగా అశ్వ‌గంధ: పరిశోధ‌న‌లకు భార‌త్ సిద్ధం
X
క‌రోనా వైర‌స్‌ కు విరుగుడు క‌నిపెట్టేందుకు అన్ని దేశాలు విస్తృతంగా ప‌రిశోధ‌న‌లు చేస్తున్నాయి. భార‌తదేశం కూడా తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తోంది. ఈ క్ర‌మంలో భార‌త‌దేశంలో ఉన్న అని వైద్య‌శాస్త్రాల్లో ప‌రిశోధ‌న‌ల‌కు ప‌చ్చ‌జెండా ఊపింది. మెడిక‌ల్‌, ఆయుర్వేదం, హోమియోప‌తి త‌దిత‌ర వైద్య‌శాస్త్రాల్లో ప్ర‌యోగాలు చేస్తున్నారు. భార‌త‌దేశ గొప్ప వైద్య‌శాస్త్ర‌‌మైన ఆయుర్వేదంలో క‌రోనా వైర‌స్‌కు విరుగుడు క‌నిపెట్టేందుకు భార‌త ప్ర‌భుత్వం చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఈ నేపథ్యంలో ఆయుర్వేద మూలిక అశ్వగంధ పై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు ప్ర‌య‌త్నాలు మొద‌ల‌య్యాయి.

అశ్వ‌గంధ మలేరియాను వాడే హైడ్రాక్సీ క్లోరోక్విన్‌తో పోలిస్తే సమర్థవంతంగా పని చేస్తుందని ప‌లువురు భావిస్తున్నారు. ఈక్ర‌మంలోని దానిపై ఐసీఎంఆర్, సీఎస్ఐఆర్ సాంకేతిక సిబ్బంది సాయంతో ఆయుష్, వైద్య, శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖలు ఉమ్మడిగా క్లినికల్ ట్రయల్స్ నిర్వహించనున్నాయి. కరోనా లక్షణాలు స్వల్పంగా, కాస్త ఎక్కువగా ఉన్న రోగులకు అశ్వగంధతో పాటు యష్టిమధు, గుడూచి, పిప్పలి, పాలా హెర్బల్ ఫార్మలేషన్ (ఆయుష్ 64) ఇస్తున్నారు. ఊపిరితిత్తులు, శ్వాస సమస్యలు రాకుండా… వస్తే వాటిని నివారించేందుకు ఈ క్లినికల్ ట్రయల్స్ ఉపయోగపడతాయని ఆయుశ్ మంత్రిత్వ శాఖ అధికారులు భావిస్తున్నారు. ఆయుశ్ 64 మందును మలేరియా నివారణకు వాడతారు. ఇప్పుడు క‌రోనా నివార‌ణ‌కు ఆ మందుతోనే ప్ర‌యోగాలు చేయాల‌ని చూస్తున్నారు.