Begin typing your search above and press return to search.

మీకు న‌చ్చిన‌ప్పుడు డ‌బ్బులు డ్రా చేసుకుంటానంటే కుద‌రదు!

By:  Tupaki Desk   |   3 May 2020 6:30 PM GMT
మీకు న‌చ్చిన‌ప్పుడు డ‌బ్బులు డ్రా చేసుకుంటానంటే కుద‌రదు!
X
దేశ‌వ్యాప్తంగా క‌రోనా క‌ల‌క‌లం కొన‌సాగుతోంది. వివిధ వ‌ర్గాలు ఈ మ‌హ‌మ్మారి కార‌ణంగా తీవ్రంగా ప్ర‌భావితం అవుతున్నాయి. ఇలాంటి స‌మ‌యంలో కేంద్ర‌ - రాష్ట్ర ప్ర‌భుత్వాలు వివిధ ప‌థ‌కాల ద్వారా ఆర్థిక స‌హాయం అందిస్తున్నాయి. కరోనా వైరస్ నుంచి పేదల్ని ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీని ఏర్పాటు చేసి ఏప్రిల్ నెల ప్రారంభం నుంచి మూడు నెలలు పాటు ప్రతీ నెల రూ.500 బ్యాంక్ అకౌంట్లలో డిపాజిట్ చేస్తోంది. తెలంగాణ ప్ర‌‌భుత్వం సైతం ప్ర‌తి నెలా 1500 రూపాయ‌లు అందిస్తోంది. అయితే, ఇలా డ‌బ్బులు డిపాజిట్ చేసిన వారు ఎప్పుడు ప‌డితే అప్పుడు తీసుకోవ‌డానికి వీలులేదు. ఔను. కేంద్ర‌ బ్యాంకింగ్‌ వ్యవహారాల శాఖ కార్యదర్శి దేబాశిష్‌ పాండా ఇదే విష‌యాన్ని స్ప‌ష్టం చేశారు.

బ్యాంకుల వద్ద రద్దీని తగ్గిస్తూ న‌గ‌దు తీసుకునేలా ఏర్పాట్లు చేసిన‌ట్లు కేంద్ర‌ బ్యాంకింగ్‌ వ్యవహారాల శాఖ కార్యదర్శి దేబాశిష్‌ పాండా వెల్ల‌డించారు. దీని ప్ర‌కారం - మే 4వ తేదీ నుంచి మే 11వ‌ర‌కూ నూత‌న విధానం అమ‌ల్లో ఉంటుంది. మే 4వ తేదీన‌ బ్యాంకు అకౌంట్ నంబ‌ర్ల‌లో చివ‌రి సంఖ్య 0 &1 ఉన్న ‌వాబ్యాంకుకు వ‌చ్చి త‌న ఖాతాలోని న‌గ‌దును విత్ డ్రా చేసుకోవ‌చ్చు. మే 5న చివ‌రి సంఖ్య 2 మ‌రియు 3 ఉన్న‌వారు - మే 6వ తేదీన బ్యాంకు ఖాతాలో 4 మ‌రియు 5 సంఖ్య‌లు ఉన్న‌వారు * మే 8వ తేదీన 6&7 సంఖ్య‌లు ఉన్న‌వారు - మే 11వ తేదీన బ్యాంకు అకౌంట్ నంబ‌రు చివ‌ర‌న 8&9 సంఖ్య‌లు ఉన్న‌వారు బ్యాంకుల వ‌ద్ద‌కు రావాల్సి ఉంటుంది. ఈ విష‌యాన్ని కేంద్ర ఆదేశాలు అనుస‌రించి బ్యాంకులు త‌మ ఖాతాదారుల‌కు తెలియ‌జేశాయి. దీంతో పాటుగా సోషల్ డిస్టెన్స్ పాటించేలా మార్గదర్శకాల్ని జారీ చేశాయి.

ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన పథకం విష‌యంలో మ‌రిన్ని మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ చేశారు. ఈ ఖాతా కింద కుటుంబంలో ఒక మహిళకు ఒక్క అకౌంట్ ఉంటే మే 4న - ఇద్దరు లేదా ముగ్గురు మహిళలకు అకౌంట్లు ఉంటే మే 5న - 4లేదా 5అకౌంట్లు ఉంటే మే 6న, 6లేదా 7 అకౌంట్లు ఉంటే మే 8న - 8లేదా 9 అకౌంట్లు ఉంటే మే 11న బ్యాంక్ అకౌంట్ల నుంచి డబ్బుల్ని డ్రా చేసుకోవచ్చని కోరారు. బ్యాంకుల వద్ద రద్దీని తగ్గిస్తూ రూపే - బ్యాంక్ మిత్రాస్ - కస్టమర్ సర్వీస్ పాయింట్స్ - ఏటీఎంలలో డబ్బుల్ని డ్రా చేసుకోవాలని కోరారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఇతర బ్యాంక్ ఎటిఎంల నుండి డబ్బును ఉపసంహరించుకోవటానికి ఎటువంటి ఛార్జీలు ఉండవని బ్యాంకింగ్‌ వ్యవహారాల శాఖ కార్యదర్శి దేబాశిష్‌ పాండా అన్నారు.