Begin typing your search above and press return to search.
ఢిల్లీ పార్కింగ్ వివాదం..కోర్టు సంచలన తీర్పు!
By: Tupaki Desk | 3 Nov 2019 6:01 PM GMTఢిల్లీ లో అనూహ్య రీతిలో పార్కింగ్ వివాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. తీస్ హజారీ కోర్టు ప్రాంగణంలో శనివారం కొంతమంది లాయర్లు - పోలీసు సిబ్బంది మధ్య పార్కింగ్ విషయం లో ఘర్షణ చోటుచేసుకుంది. ఇరు వర్గాల మధ్య జరిగిన పార్కింగ్ వివాదం ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. పోలీసులు ఫైరింగ్ చేయడం - పోలీస్ వాహనానికి ఒకరు నిప్పంటించడంతో కాసేపు ఆ ప్రాంగణమంతా ఉద్రిక్తంగా మారింది. ఈ ఉదంతం విషయంలో సెలవు రోజు అయినప్పటికీ...పోలీస్ - లాయర్ల వివాదాన్ని ఆదివారం ఢిల్లీ హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ సందర్భంగా పోలీసులు దీనిపై స్పెషల్ క్రైం బ్రాంచ్ టీమ్ తో దర్యాప్తు చేయిస్తున్నామని చెప్పారు. అయితే దీనికి ఒప్పుకోని లాయర్లు జుడిషియల్ విచారణ కోరారు. రిటైర్డ్ ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ ఎస్పీ గార్గ్ నేతృత్వంలో జుడిషియల్ కమిటీని నియమించింది. దీంతో పాటుగా తీస్ హజారీ కోర్టు ఘటనలో గాయపడిన లాయర్ విజయ్ వర్మకు రూ.50 వేలు - మరో ఇద్దరు లాయర్లకు రూ.15 వేలు - రూ.10 వేలు చొప్పున పరిహారం ఇవ్వాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఈ ఘటనకు సంబంధించి ప్రత్యక్ష సాక్షి అయిన బార్ అసోసియేషన్ ఆఫీస్ బేరర్ జై బిశ్వాల్ తెలిపిన వివరాల ప్రకారం... శనివారం మధ్యాహ్నం కోర్టుకు వస్తుండగా ఓ లాయర్ వెహికిల్ ను పోలీసు వాహనం ఢీకొట్టింది. పోలీసులతో లాయర్ కోపంగా మాట్లాడుతుండగా ఆరుగురు పోలీసు సిబ్బంది అతన్ని లోపలికి తీసుకెళ్లి దాడి చేశారని ఆయన ఆరోపించారు. లాయర్ పై దాడిని గమనించిన కొంతమంది స్థానికులు పోలీసులకు సమాచారం అందించారని ఆఫీస్ బేరర్ పేర్కొన్నారు. ఇదే సమయంలో అక్కడికి కొంతమంది లాయర్లు చేరుకున్నారు. అదే సమయంలో పోలీసు సిబ్బంది సైతం వచ్చారు. దీంతో వాగ్వాదం - తోపులాట జరగడంతో అక్కడే ఉన్న ఓ లాయర్ గాయపడ్డాడు. పోలీసులు ఒక దశలో లాఠీ చార్జ్ చేయడమే కాకుండా ఫైరింగ్ సైతం జరిగింది. పోలీసులు ఫైరింగ్ చేయడం - పోలీస్ వాహనానికి ఒకరు నిప్పంటించడంతో కాసేపు ఆ ప్రాంగణమంతా ఉద్రిక్తంగా మారింది.పోలీసు ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఈ మొత్తం రచ్చలో 20 మంది గాయపడ్డారు. వారిలో ఇద్దరు లాయర్లకు తీవ్రంగా గాయాలు కావడంతో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.
ఆదివారం జరిగిన విచారణ సందర్భంగా పోలీసు వర్గాలు - న్యాయవాదులకు మధ్య హాట్ హాట్‌గా వాదప్రతివాదనలు సాగాయి. సీజే జస్టిస్ డీఎన్ పటేల్ తీర్పును వెలువరిస్తూ...రిటైర్డ్ ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ ఎస్పీ గార్గ్ నేతృత్వంలో జుడిషియల్ కమిటీని నియమించారు. సీబీఐ డైరెక్టర్ - ఐబీ డైరెక్టర్ - విజిలెన్స్ డైరెక్టర్ లేదా వారు నియమించిన సీనియర్ అధికారి సభ్యులుగా ఉండాలని - ఎంక్వైరీ ఆరు వారాల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ ఘటనకు బాధ్యుల్ని చేస్తూ స్పెషల్ కమిషనర్ సంజయ్ సింగ్ - అడిషనల్ డీసీపీ హరీందర్ సింగ్ లను బదిలీ చేయాలని - అలాగే దురుసుగా ప్రవర్తించిన పోలీసు అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని సూచించారు. కాగా - ఢిల్లీ బార్ కౌన్సిల్ బాధితుల విషయంలో ఉదారంగా స్పందించింది. ఐసీయూలో చికిత్స పొందుతున్న ఇద్దరు లాయర్లకు రూ.2 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని ప్రకటించింది. అలాగే గాయాలైన మిగిలిన లాయర్లకు తలా 50 వేలు ఇస్తామని తెలిపింది.