Begin typing your search above and press return to search.
థియేటర్లలో జాతీయగీతం..వెనక్కు తగ్గిన కేంద్రం
By: Tupaki Desk | 9 Jan 2018 7:57 AM GMTథియేటర్లలో సినిమా ప్రారంభానికి ముందు జాతీయ గీతం ప్రదర్శించాలని - ఆ సమయంలో ప్రేక్షకులు నిల్చోవాలని 2016లో సుప్రీంకోర్టు విడుదల చేసిన ఆదేశాల విషయంలో కేంద్రం వెనక్కు తగ్గింది. ఈ ఆదేశాలు కొన్నిచోట్ల కఠినంగా అమలు అవుతుండటం...ఈ సమయంలో వివాదం చోటుచేసుకున్నట్లుగా వార్తలు తెరమీదకు వచ్చాయి. జాతీయ గీతం ఆలపించే సమయంలో గౌరవ సూచకంగా నిల్చోకపోవడంతో ఇద్దరు యువతులతోపాటు ఆరుగురు యువకులపై చెన్నైలో కేసు నమోదైంది. తద్వారా జాతీయ గీతాన్ని గౌరవించలేదంటూ నమోదైన మొదటి కేసుగా నిలిచిపోయింది. అంతే కాకుండా ఈ సంఘటన ప్రేక్షకుల మధ్య వివాదానికి కూడా కారణమైంది.
అనంతరం కూడా పలు ఉదంతాలు చోటుచేసుకున్నాయి. జాతీయగీతం ఆలపిస్తున్నప్పుడు నిలబడ లేదని కొన్నిచోట్ల వికలాంగుల పట్ల కూడా పలువురు దురుసుగా ప్రవర్తించారు. అంతేకాకుండా ఇది దేశభక్తికి సంబంధించిన అంశంగా కూడా మారిపోయింది. ఈ గీతాలపన సమయంలో తాము నిలబడకపోతే దేశభక్తి లేనట్లా అని పలువురు ప్రశ్నించారు. అయితే ఈ విషయంలో కేంద్రం వెనక్కు తగ్గలేకపోయింది...అలా అని ముందుకు సాగలేకపోయింది. ఈ నేపథ్యంలో మరోమారు సుప్రీం జోక్యం చేసుకుంది.
తన తీర్పును సమీక్షించుకునేందుకు సర్వోన్నత న్యాయస్థానం ముందుకు వచ్చింది. సినిమా హాళ్లలో జాతీయ గీతం తప్పనిసరి అని, ఆ సమయంలో ప్రతి ఒక్కరూ లేచి నిలబడాలన్న గతేడాది తీర్పును పునఃసమీక్షించడానికి సుప్రీంకోర్టు సంసిద్ధత వ్యక్తంచేసింది. చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం ఈ అంశంపై విచారణ జరిపింది. మోరల్ పోలీసింగ్‌కు ఫుల్‌స్టాప్ పడాల్సిందేనని, ప్రతి ఒక్కరూ ఎప్పుడూ తమ భుజాలపై దేశభక్తిని మోయాల్సిన అవసరం లేదని ఈ బెంచ్ అభిప్రాయపడింది. థియేటర్లలో జాతీయ గీతం పాడనంత మాత్రాన వాళ్లు జాతి వ్యతిరేకులు కారని సుప్రీం ధర్మాసనం స్పష్టంచేసింది.
ప్రతి థియేటర్‌లో సినిమా మొదలయ్యే ముందు జాతీయ గీతం వేయాలని, ప్రేక్షకులంతా లేచి నిలబడాల్సిందే అని గతేడాది సుప్రీం తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. దీనిపై దాఖలైన పిటిషన్‌పై విచారణ చేస్తూ ``జాతీయ గీతం సమయంలో అందరూ కచ్చితంగా లేచి నిలబడాలని అనుకున్నపుడు ఎందుకు దాని కోసం ప్రత్యేకంగా నిబంధనలను రూపొందించడం లేదు?`` అని సుప్రీం కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసింది. గతేడాది నవంబర్‌లో సినిమా హాళ్లలో జాతీయ గీతంపై సుప్రీం ఇచ్చిన తీర్పుపై జస్టిస్ డీవై చంద్రచూడ్ అసంతృప్తి వ్యక్తంచేశారు. `ఈ తీర్పును ఉల్లంఘిస్తే జాతి వ్యతిరేకులుగా ముద్ర వేస్తారని ప్రజలు భయపడుతున్నారు. వాళ్లు సినిమా హాళ్లకు వచ్చేది కేవలం వినోదం కోసమే. వాళ్లకు అదే కావాలి. మోరల్ పోలీసింగ్ కాదు` అని చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. ఆ తర్వాత అంగ వైకల్యం ఉన్నవారిని ఇందులోంచి మినహాయిస్తూ తమ తీర్పును కాస్త సవరించింది.
ఈ నేపథ్యంలో కేంద్రం వెనక్కు తగ్గింది. థియేటర్‌లో సినిమా ప్రారంభానికి ముందు జాతీయ గీతాన్ని వినిపించే విషయంలో స్టేటస్ కో విధించుకోవచ్చని సుప్రీంకోర్టుకు తాజాగా కేంద్ర హోంశాఖ తెలియజేసింది. తద్వారా సర్వోన్నత న్యాయస్థానం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దానికి బాధ్యత వహిస్తానని స్పష్టం చేసింది.