Begin typing your search above and press return to search.
ఆ రెండు కేంద్రపాలిత ప్రాంతాలు ఏకం కానున్నాయా?
By: Tupaki Desk | 23 Nov 2019 4:32 AM GMTపాలనలో తన మార్క్ ను చూపించేందుకు ప్రధాని మోడీ తీసుకునే నిర్ణయాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. తాజాగా ఆయన మరో నిర్ణయాన్ని తీసుకున్నారు. కేంద్రపాలిత ప్రాంతాలుగా ఉన్న రెండింటిని ఒకటిగా ఏకం చేయనున్నారు. దీనికి సంబంధించి బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెట్టాలని కేంద్రం నిర్ణయించింది. కేంద్రపాలిత ప్రాంతాలుగా సుపరిచితమైన డామన్ డయ్యూ.. దాద్రా నగర్ హవేలీలను ఒకే కేంద్రపాలిత ప్రాంతంగా తీసుకురానున్నారు.
ఎందుకిలా? అంటే.. కేంద్రం చెబుతున్న వాదన ఆసక్తికరంగా ఉంది. కేవలం 35 కి.మీ. దూరంలో ఉండే ఈ రెండు కేంద్రపాలిత ప్రాంతాలకు వేర్వేరు సచివాలయాలు.. బడ్జెట్ లు ఉండటంతో నిర్వహణ వ్యయాన్ని తగ్గించటంతో పాటు.. పాలనను మరింత సులభతరం చేసేందుకు వీలుగా కేంద్రం ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో రెండు కేంద్రపాలిత ప్రాంతాల్ని కలిపేయనున్నారు. మరి.. పేరు మాటేమిటి అన్న డౌట్ వచ్చిందా? అక్కడికే వస్తున్నాం. రెండింటిని కలిపేస్తున్న వేళ.. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు వీలుగా దాద్రా నగర్ హవేలీ.. డామన్ అండ్ డయ్యూ అనే పేరును పెడతారని చెబుతున్నారు.
కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం కానీ అమల్లోకి వస్తే.. దేశంలో కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య ఎనిమిదికి తగ్గుతుంది. అంతా బాగుంది కానీ.. ఆయా కేంద్రపాలిత ప్రాంతాల ప్రజల రియాక్షన్ ఎలా ఉందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.