Begin typing your search above and press return to search.
నిజమేనా?; నోట్ల కష్టాలు ఆరు నెలలు తప్పవా?
By: Tupaki Desk | 18 Nov 2016 4:31 AM GMTపెద్దనోట్లను రద్దు చేస్తూ ప్రధాని సంచలన నిర్ణయాన్ని ప్రకటించి పది రోజులు దాటిపోయింది. మొదట్లో కాస్త ఇబ్బంది ఉన్నా.. వారం దాటితే అంతా కామన్ అయిపోతుంది.సమస్యలు అన్నవే ఉండవన్న మాట వినిపించింది. అయితే.. అదేమీ చెప్పినంత ఈజీ కాదన్న విషయం ఇప్పుడు జనాలకు అర్థమవుతున్న పరిస్థితి. నోట్ల రద్దు తర్వాత మొదటి వీకెండ్ వెళ్లిపోయి.. మరో వీకెండ్ ఒక్కరోజు దూరంలో ఉంది. అయినప్పటికీ.. బ్యాంకుల ఎదుట క్యూ బారులు తగ్గటం లేదు. ఎనీ టైం మనీ అని చెప్పే ‘‘ఏటీఎం’’లు ఇప్పుడు తన పేరును మార్చేసుకొని ‘‘ఎనీ టైం నో మనీ’’అన్నట్లుగా మారిపోయాయి.
పగలు రాత్రి అన్న తేడా లేకుండా మీ అవసరాల్ని తీర్చేందుకే మేం ఉన్నామన్నట్లుగా ఉండే ఏటీఎంలు.. ఈ మధ్యన షట్టర్లు మూసేసిన వైనం కనిపిస్తోంది. నోట్ల రద్దు తొలినాళ్లలో ఇలాంటి మామూలే అనుకున్నా.. రోజులు గడుస్తున్నా ఇదే పరిస్థితి కంటిన్యూ కావటం పలువురికి కన్ఫ్యూజింగ్ గా మారింది. ఇదిలా ఉంటే.. పాత నోట్ల రద్దు.. కొత్త నోట్ల కొరతపై పలు వాదనలు వినిపిస్తున్నాయి. నిపుణుల మాట ఒకరకంగా ఆర్థిక శాఖకు చెందిన వారి మాటలు మరోలా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో నోట్ల కష్టాలు ఎన్ని రోజులు? ఎప్పటికి ఈ లెక్క ఒక కొలిక్కి వచ్చేను? అన్నది ఇప్పుడుపెద్ద ప్రశ్నగా మారింది.
దీనిపై తాజాగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు సలహాదారుల్లో ఒకరు.. ఆర్థికవేత్త సౌమిత్ర చౌదురి ఆసక్తికర వాదనను వినిపించారు. తన బ్లాగులో ఆయన కొత్త నోట్లకు సంబంధించిన ఒక లెక్కను వివరంగా చెప్పుకొచ్చారు. ఆయన వాదననను వింటే గుండె గుభేల్ మనటంతో పాటు.. నోట్ల కష్టాలు మరో ఆర్నెల్లకు పైనే సాగుతాయన్నది కన్ఫర్మ్ అని తేలిపోతుంది. ఇంతకీ ఆయన వాదన ఏమిటి? దాని లాజిక్ ఏమిటో చూస్తే..
‘‘నోట్ల రద్దు నేపథ్యంలో ఆర్ బీఐ చెబుతున్న గణాంకాల ప్రకారం వ్యవస్థ మొత్తం నుంచి వెయ్యి నోట్లు 670 కోట్లు.. రూ.500 నోట్లు 1660 కోట్లు ఉన్నట్లుగా చెబుతున్నారు. ఈ రెండు డినామినేషన్ల నోట్లు మొత్తం 2300 కోట్ల నోట్లుగా చెబుతున్నారు. అంతే దీని విలువ రూ.15లక్షల కోట్లు. అంటే.. ఈ విలువ మొత్తం పాత నోట్లను బ్యాంకులకు చేర్చటం ఒక ఎత్తు అయితే.. అదే మొత్తం నోట్ల కొత్తవి అచ్చు వేసి.. ప్రజల్లోకి పంపిణీ చేయటం. ఒకవేళ బ్లాక్ మనీ పెద్ద ఎత్తున ఉండి.. ఈ విలువలో కొంత మొత్తం వెనక్కి రాకుంటే.. వాటి స్థానే ప్రింటింగ్ చేసిన నోట్లను ప్రభుత్వం తన సొమ్ముగా చేసుకొని అభివృద్ధి కార్యక్రమాల మీద ఖర్చుచేసే వీలుంది. ఇక.. ఈ నోట్లను ప్రింట్ చేసే సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కు ఎంత కాలం పడుతుంది? అన్న ప్రశ్నకు సమాధానం వెతికితే.. అనేక నెలలు అని చెప్పాలి’’
‘‘ఎందుకంటే.. అధిక కరెన్సీ డినామినేషన్ నోట్లను ప్రింట్ చేసే సామర్థ్యం నెలకు 130 కోట్ల నోట్లు మాత్రమే. ఒకవేళ ముద్రణా సామర్థ్యాన్ని రెట్టింపు చేసినా.. మరో షిఫ్ట్ అదనంగా చేసి ప్రింట్ చేయించినా 200 కోట్ల నోట్లను మాత్రమే నెలకు ముద్రించే వీలుంది. అంటే రూ.1000 నోట్ల స్థానంలో రూ.2వేల ప్రింట్ చేసేపని మీదే ఉన్నా ఈ ఏడాది చివర వరకూ పడుతుంది. రూ.500 నోట్ల స్థానంలో కొత్తవి ప్రింట్ చేసి విడుదల చేయాలన్నా మరిన్ని నెలలు పట్టటం ఖాయం’’ ‘‘అందుకే.. నోట్ల కొరత నెలల పాటు సాగే వీలుంది. ఇక.. ప్రస్తుతం ఉన్న రూ.500.. రూ.వెయ్యి నోట్ల డినామిషేన్ నోట్ల విలువకు సరిపడా కరెన్సీని ప్రింట్ చేయాలంటే కొద్ది నెలల పడుతుంది. అంతవరకూ వెయిట్ చేయక తప్పదు’’ అని చెప్పుకొచ్చారు. ఈ వాదనలో వినిపించని.. పరిగణనలోకి తీసుకోవాల్సిన పాయింట్ ఏమిటంటే.. రద్దు నిర్ణయానికి రెండు నెలల ముందే నోట్ల ముద్రణ మొదలైందన్నది. మరి.. గత రెండు నెలల వ్యవధిలో కొత్త నోట్లను ఎంత ముద్రించారన్నది లెక్కలోకి తీసుకుంటే.. అసలు లెక్క ఇట్టే తెలిసే వీలుందని చెప్పొచ్చు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/