Begin typing your search above and press return to search.
ఈశాన్యం కోసం కొత్తగా ఎయిర్ లైన్స్ వచ్చేస్తోంది
By: Tupaki Desk | 8 July 2016 12:48 PM GMTప్రధాని మోడీకి ఈశాన్యం మీద మమకారం ఎక్కువ. ఏ మత్రం అవకాశం చిక్కినా ఆయన ఈశాన్య రాష్ట్రాలపై తన అభిమానాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేస్తారు. తాజాగా అలాంటి నిర్ణయాన్ని తీసుకుంది కేంద్రం. ఈశాన్య రాష్ట్రాలకు విమాన సౌకర్యం తక్కువగా ఉన్న నేపథ్యంలో.. ఈశాన్య రాష్ట్రాల రాజధానులకు విమాన సర్వీసులు పెంచేందుకు వీలుగా ఏకంగా ఒక ప్రత్యేక ఎయిర్ లైన్స్ ను ఏర్పాటు చేయాలని కేంద్రం డిసైడ్ అయ్యింది.
నైసర్గిక పరిస్థితుల కారణంగా ఈశాన్య రాష్ట్రాల్లోని రాజధాని నగరాలకు విమాన సర్వీసులు చాలా తక్కువగా ఉన్న పరిస్థితి. అరకొరగా ఉన్న విమాన సర్వీసుల కారణంగా అక్కడి ప్రజలు ఇబ్బందులకు గురి అవుతున్నారు. ఇప్పటివరకూ వీరి పడుతున్న బాధల్ని ఏ కేంద్రప్రభుత్వం పట్టించుకున్నది లేదు. ఇందుకు మినహాయింపుగా ప్రధాని మోడీ రంగంలోకి దిగారని చెప్పాలి.
ఈ కొత్త ఎయిర్ లైన్స్ లో మొత్తం ఆరు విమానాలు.. ఐదు హెలికాఫ్టర్లు ఉండనున్నాయి. ఈ కొత్త ఎయిర్ లైన్స్ లో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన పవన్ హన్స్ కు 51 శాతం వాటా ఉంటుండగా.. ఈశాన్య రాష్ట్రాల వాటా 49 శాతంగా ఉండనుంది. ఈ కొత్త ఎయిర్ లైన్స్ ఏర్పాటు పూర్తి అయిన వెంటనే.. ఈశాన్య రాష్ట్రాల రాజధాని నగరాలకు విమాన సర్వీసుల సంఖ్య పెద్ద ఎత్తున పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.