Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ కు దారుణ అవమానం పొంచి ఉందా?

By:  Tupaki Desk   |   24 Sep 2016 7:53 AM GMT
కాంగ్రెస్ కు దారుణ అవమానం పొంచి ఉందా?
X
కొన్ని విష‌యాలు వినేందుకే విచిత్రంగా అనిపిస్తాయి. దేశంలో ఇప్పటివరకూ అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాల్లో కాంగ్రెస్ నేతృత్వంలోనే అధిక కాలం పాలన సాగిన విషయం తెలిసిందే. మరి దేశాన్నే నడిపించిన ఈ పార్టీ.. ఎన్నో నియమనిబంధనల్ని తీసుకొచ్చింది. చట్టాల్ని తయారుచేయటమే కానీ వాటిని అమలు చేయటం అవసరం లేదన్నభావన కాంగ్రెస్ కు ఉందా? అన్న సందేహం కలిగే ఉదంతం ఒకటి తాజాగా వెలుగు చూసింది.

అదెలాగంటే.. ఢిల్లీలోని 24 అక్బర్ రోడ్డులో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం ఉన్న విషయం తెలిసిందే. ఈ ఆఫీసును కేంద్రం స్వాధీనం చేసుకోనుందా? అంటే ఏమో.. అలా జరగొచ్చేమోనన్న అభిప్రాయం కలగక మానదు. ఎందుకంటే.. నిబంధనల ప్రకారం నిర్దేశిత‌ అద్దె చెల్లించాల్సిన కాంగ్రెస్.. చెల్లించలేదన్న ఆరోపణ తెర మీదకు రావటమే. ఎన్నో చట్టాల్ని రూపొందించిన అనుభవం ఉన్న నేతలు కాంగ్రెస్ లో పుష్కలంగా ఉంటారు. అలాంటి వారున్న పార్టీ రూల్స్ ను పాటించకపోవటం ఆశ్చర్యం కలిగించటం ఖాయం. ఢిల్లీలోకాంగ్రెస్ పార్టీకి మూడు ఆపీసులు ఉన్నాయి. వాటిని ప్రభుత్వం నుంచి కాంగ్రెస్ పార్టీ అద్దెకు తీసుకుంది. అందులో ఒకటి 24 అక్బర్ రోడ్డులో.. రెండోది 5 రైసినా రోడ్డులో ఉన్న భవనం.. మూడోది చాణక్యపురిలో మరో కార్యాలయం ఉంది. వీటిల్లో పార్టీతో పాటు.. పార్టీ అనుబంధ కార్యాలయాల్ని ఏర్పాటు చేశారు.

ఇదిలా ఉంటే.. 2010లో రౌస్ అవెన్యూలో అప్పటి ప్రభుత్వం.. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ కు భూమిని కేటాయించింది. భూమిని కేటాయించిన మూడేళ్లలో ఆఫీసును నిర్మించాల్సి ఉంటుంది. కానీ.. ఆ పని చేయని పక్షంలో ప్రభుత్వం భూమిని తిరిగి తీసుకునే వీలు ఉంటుంది. ఏమైందో కానీ.. దాదాపు ఆరేళ్ల క్రితం భూమిని కేటాయించినా ఇప్పటివరకూ కాంగ్రెస్ భవనాన్ని నిర్మించలేదు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం ఉన్న 24 అక్బర్ రోడ్ లో ఉన్న ప్రధాన కార్యాలయాన్ని 2013లో ఖాళీ చేయాల్సిఉంది. అయితే.. భవన నిర్మాణం పూర్తి కాకపోవటంతో పార్టీ ఆఫీసును ఖాళీ చేయలేదు. అదే సమయంలో చెల్లించాల్సిన నిర్దేశిత‌ అద్దె చెల్లించటం లేదు. దీంతో.. మోడీ సర్కారు పవర్ లోకి వచ్చిన వెంటనే (2015 జనవరిలో) నోటీసులు జారీ చేశారు. అయినప్పటికీ ఎలాంటి రెస్పాన్స్ లేకపోవటంతో అధికారులు మరోసారి నోటీసులు ఇవ్వటానికి రెడీ అవుతున్నారట. ఒకవేళ అదే జరిగితే కాంగ్రెస్ పార్టీకి అంతకు మించిన అవమానం ఇంకేం ఉంటుంది..?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/