Begin typing your search above and press return to search.
జగన్ సర్కారుకు మంట పుట్టిస్తున్న మానసపుత్రికలు!
By: Tupaki Desk | 11 Jan 2022 11:30 AM GMTఅండగా నిలుస్తారనుకున్నోళ్లే.. అడ్డం తిరిగితే ఎలా ఉంటుంది? కోరకుండానే వరాలు ఇచ్చే దేవుడిగా.. సంక్షేమ పథకాల అమలులో దేశంలో మరే ముఖ్యమంత్రికి సాధ్యం కాని రీతిలో అమలు చేస్తున్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు అనూహ్య పరిణామాలు ఎదురవుతున్నాయి. తనకు అండగా నిలిచిన వారికి వడ్డీతో సహా రుణం తీర్చుకునే అలవాటు ఉందని చెప్పే సీఎం జగన్.. ఇప్పుడు అందుకు భిన్నంగా వ్యవహరించటాన్నిఆయన్ను అమితంగా ఆరాధించే వారు జీర్ణించుకోలేకపోతున్నారు.
గత ఎన్నికల్లో తనకు అండగా నిలిచిన ప్రభుత్వఉద్యోగులకు.. తాజాగా ప్రకటించిన పీఆర్సీతో మంట పుట్టిన వైనం తెలిసిందే. చేతికి ఎముక లేదంటూనే.. తమకు షాకిచ్చిన వైనాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇది సరిపోదన్నట్లు హెచ్ఆర్ విషయంలో కొత్త విధానాన్ని అమల్లోకి తెస్తారన్న వార్తలు వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేస్తున్నాయి. ఒకవేళ అదే జరిగితే.. ఒక్కో ఉద్యోగికి వచ్చే జీతంలో కనీసం నాలుగైదు వేల రూపాయిల మేర కోత పడుతుందని చెబుతున్నారు. ఒకవేళ.. అలాంటి నిర్ణయాన్ని ప్రకటిస్తే.. జగన్ సర్కారు తమకు చేసిన దాన్ని ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పటికి మర్చిపోరని చెబుతున్నారు.
ఇదిలా ఉంటే.. జగన్ మానసపుత్రికలుగా అభివర్ణించే.. గ్రామ.. వార్డు వాలంటీర్ల వ్యవస్థ.. సచివాలయ ఉద్యోగుల విషయంలో వ్యవహరిస్తున్న తీరుపైనా గుర్రుగా ఉన్నారు. ప్రభుత్వం కొలువు తీరినంతనే.. గ్రామ సచివాలయాల కాన్సెప్టును తెర మీదకు తీసుకొచ్చిన జగన్ ప్రభుత్వం.. రూ.15వేల జీతంతో పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఇవ్వటం తెలిసిందే. రెండేళ్ల తర్వాత వారందరిని పర్మినెంట్ చేస్తామని ఊరించటంతో.. తక్కువ జీతానికైనా ఇంతకాలం పని చేశారు. తీరా.. రెండేళ్లు గడిచిపోయిన తర్వాత మరో ఆర్నెల్ల వరకు పర్మినెంట్ చేసే అంశంపై నిర్ణయం తీసుకునేది లేదన్న విషయాన్ని తేల్చేయటంపై సచివాలయ ఉద్యోగులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో తాము ఏర్పాటు చేసిన గ్రామ.. వార్డు సచివాలయాలు ఓట్లు కురిపించే కేంద్రాలుగా మారుతాయని జగన్ సర్కారు నమ్ముతోంది.
మరి.. అంతటి ప్రాధాన్యత ఉన్న వారి విషయంలో జగన్ సర్కారు తీసుకోవాల్సిన కీలక నిర్ణయాన్ని ఎందుకు వాయిదా వేస్తున్నారు? వారికి ఆగ్రహాన్ని ఎందుకు కలిగిస్తున్నారు? అన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. నిజానికి ఈ వ్యవస్థ మీద న్యాయవివాదాలు ఉన్నప్పటికీ.. తాము తీసుకొచ్చిన ఈ సచివాలయాల వ్యవస్థను ఏదోలా కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పుడు జీతాల విషయంలో వచ్చిన పేచీతో.. వారు నిరసన బాట పడుతున్న పరిస్థితి. మొన్నటికి మొన్న వాట్సాప్ గ్రూపుల నుంచి ఎగ్జిట్ కావటం ద్వారా దిమ్మ తిరిగే షాకిచ్చన సచివాలయ ఉద్యోగులు.. మరిన్ని నిరసన కార్యక్రమాల్ని చేపట్టాలన్న యోచనలో ఉన్నారు.
అయితే.. వారిని నయానోభయానో దారికి తెచ్చుకోవాలన్న ప్రయత్నాలు ఇప్పటికి ఫెయిల్ అయ్యాయి. రానున్న రోజుల్లో ఇదే తీరును ప్రదర్శిస్తే మొదటికే మోసం వస్తుందని చెబుతున్నారు. వరాల దేవుడిగా.. కోరకుండానే కడుపు నిండేలా సంక్షేమ పథకాల్ని అమలు చేసే సీఎం జగన్.. తన మానసపుత్రికల విషయంలో ఇంత పక్షపాతాన్ని ప్రదర్శిస్తున్నారు? అన్నది ప్రశ్నగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా 1.15లక్షల మంది సచివాలయ ఉద్యోగులు ఉండటం.. వారంతా ఆందోళన బాట పడుతున్న నేపథ్యంలో.. వారిని కట్టడి చేయటం ఎలా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.
గతంలో తమకు ఇచ్చిన హామీకి తగ్గట్లు తమకు ప్రొబెషన్ ఇస్తే తప్పించి వెనక్కి తగ్గేది లేదని సచివాలయ ఉద్యోగులు స్పష్టం చేస్తున్నారు. అప్పటివరకు నిరసనలు.. ఆందోళనలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఈ హెచ్చరికలు పెరిగిన తర్వాత.. ప్రభుత్వం మేల్కొని వారి డిమాండ్లను కొంత తీర్చినా.. ఎలాంటి ఫలితం ఉండదని చెబుతున్నారు. తమ నిరసనలు.. ఆదోళనలే ప్రభుత్వ ఆలోనల్ని మార్చాయే తప్పించి.. తమ మీద ప్రత్యేక అభిమానం ఏమీ లేదన్న భావన కలుగుతుందన్న వాదన వినిపిస్తోంది. అదే జరిగితే.. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా మారుతుందంటున్నారు. తన మానసపుత్రికలే తన ప్రభుత్వానికి మంట పుట్టిస్తున్న వైనాన్ని సీఎం జగన్ ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరేం చేస్తారో చూడాలి.