Begin typing your search above and press return to search.

ఏపీ వలంటీర్ ఆత్మహత్యతో విషాదం

By:  Tupaki Desk   |   8 Sep 2019 8:12 AM GMT
ఏపీ వలంటీర్ ఆత్మహత్యతో విషాదం
X
పనిచేయలేదంటూ ఓ మహిళ తిట్టినందుకు కొత్తగా కొలువులో చేరిన ఓ ప్రభుత్వ వలంటీర్ ఆత్మహత్య చేసుకోవడం విషాదం నింపింది. అందరిముందే దుర్భాషలాడడంతో తట్టుకోలేకపోయిన మహిళా వలంటీర్ మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న సంఘటన పశ్చిమ గోదావరి జిల్లా జీలుగుమిల్లి మండలం పండువారిగూడెంలో చోటుచేసుకుంది.

పండువారిగూడెం గ్రామానికి చెందిన పండు నవీన (23) ఇటీవలే ఏపీ ప్రభుత్వం కొత్తగా ప్రతీ 50 ఇళ్లకు ఒక వలంటీర్ ఉద్యోగాల్లో ప్రతిభ చాటి ఉద్యోగం సంపాదించింది. ఆ గ్రామంలో సేవలందిస్తోంది.

అయితే ఇదే గ్రామానికి చెందిన మంగ అనే మహిళ ప్రభుత్వ పని అనుకొని తన ఆధార్ కార్డులో ఇంటిపేరు మార్చాలని వలంటీర్ అయిన పండు నవీనను కోరింది. అయితే ఆధార్ లో మార్పులు తన పరిధి కాదని.. ఆధార్ కేంద్రానికి లేదా మీ సేవకు వెళ్లాలని నవీన్ సదురు మహిళ మంగకు సూచించింది. దీంతో పనిచేయడం చేతకాక చెబుతున్నావా అంటూ నవీనపై మంగ తీవ్రంగా దుర్భాషలాడింది. దీంతో మనస్తాపానికి గురైన నవీన కుటుంబ సభ్యులందరూ వ్యవసాయ పనులకు వెళ్లిన వేళ ఫ్యాన్ కు ఉరివేసుకొని తనువు చాలించింది. సూసైడ్ నోట్ లో మంగ తిట్టడం వల్లే ఆత్మహత్య చేసుకున్నట్టు రాసింది. తల్లిదండ్రులను క్షమించాలంటూ లేఖలో రాసుకొచ్చింది. నవీన తండ్రి ఫిర్యాదు మేరకు మంగపై కేసు నమోదు చేశారు.