Begin typing your search above and press return to search.
బీజేపీకి గర్వభంగం
By: Tupaki Desk | 8 Nov 2015 6:52 AM GMTబీహార్ ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయేకు గర్వభంగం అయింది. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కంటే దాదాపు అన్ని రౌండ్లలో మహాకూటమి ఆధిక్యంలో కొనసాగుతూ వచ్చింది. తాజా సమాచారం ప్రకారం పార్టీల వారీగా ఆధిక్యత ఇలా ఉంది. జేడీయు 67 - ఆర్జేడీ 65 - కాంగ్రెస్ 15 స్థానాల్లో ఆధిక్యతలో ఉంది. కాగా బిజెపి నేతృత్వంలోని ఎన్ డీఎలో బిజెపి 63 స్థానాల్లోనూ - ఎల్ జేపీ 9 స్థానాల్లో - ఆర్ ఎల్ ఎసీ 5 - హెచ్‌ఎఎ 4 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. కాగా ఈ ఎన్నికల్లో పోటీ చేసిన సమాజ్ వాదీ పార్టీ - ఎంఐఎం - ఎన్ సీపీ పార్టీలకు ఒక స్థానం కూడా లభించే అవకాశాలు కనిపిచడం లేదు.
మరోవైపు బీహార్ లో ఎన్నికల ఫలితాల సరళిని ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. మధ్యాహ్నం 11.50కి ఏ పార్టీ ఎన్ని స్థానాలలో గెలుపొందింది. ఎన్ని స్థానాలలో ఆధిక్యంలో ఉంది అన్న వివరాలను అధికారికంగా వెలువరించింది. ఆ మేరకు ఇప్పటి వరకూ 2 స్థానాల ఫలితాలు ప్రకటించగా ఆ రెండింటినీ జేడీయూ కూటమి గెలుచుకుంది. మరో 159 స్థానాలలో ఆధిక్యతలో ఉంది. ఇక బీజేపీ కూటమి 70 స్థానాలలో ఆధిక్యతలో ఉంది. ఇతరులు 12 స్థానాలలో ముందంజలో ఉన్నారు.
మహాకూటమి గెలుపు ఖాయమవుతున్న నేపథ్యంలో ముచ్చటగా మూడోసారి నితీష్ కుమార్ అధికారంలోకి రానున్నారు. మహాకూటమి అత్యధిక స్థానాల్లో ముందంజలో ఉన్న క్రమంలో ఆర్జేడీ - జేడీయూ - కాంగ్రెస్ కార్యకర్తలు సంబురాలు చేసుకున్నారు. ఆయా పార్టీ కార్యాలయాల్లో బాణాసంచా కాల్చుతూ హుషారుతో స్టెప్పులేస్తున్నారు.