Begin typing your search above and press return to search.

సంప్రదాయాన్ని పక్కనపెట్టి స్వాగతం

By:  Tupaki Desk   |   17 Aug 2015 4:30 AM GMT
సంప్రదాయాన్ని పక్కనపెట్టి స్వాగతం
X
రెండు రోజుల అరబ్ దేశాల పర్యటనలో ప్రధాని ఆదివారం అబుదాబిలో అడుగుపెట్టటం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రధాని మోడీకి అద్భుత స్వాగతం లభించింది. సంప్రదాయాల్ని పక్కన పెట్టేసి మరీ.. ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు ముస్లిం రాజ వంశీకులు వెనుకాడలేదు. అబుదాబిలో దిగిన మోడీకి.. సంప్రదాయాల్ని పక్కన పెట్టేసిన యువరాజు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ ఆల్ నహైన్ విమానాశ్రయానికి వచ్చి మరీ స్వాగతం పలికారు. అంతేకాదు.. తన ఐదుగురు సోదరులతో కలిసి యువరాజు మోడీకి గ్రాండ్ వెలకమ్ పలికారు.

మక్కా.. మదీనాల తర్వాత ప్రపంచంలోనే అతి పెద్దదైన మసీదును సందర్శించిన మోడీ.. ఈ సందర్భంగా యువరాజుతో కలిసి సెల్ఫీ తీసుకున్నారు. భారతీయ కార్మికులను వారి శిబిరాల్లోకలిసి.. వారితో ఫోటోలు దిగారు తన తాజా పర్యటనలో మోడీ అరబిక్ లో ట్వీట్ చేశారు తనకు ఘన స్వాగతం పలకటం పట్ల ఆయన ఆనందాన్ని వ్యక్తం చేశారు.

తన యూఏఈ పర్యటన సందర్భంగా మోడీ కొన్ని అంశాల్ని మొహమాటం లేకుండానే ప్రస్తావించారు. ఎడారిలో స్వర్గధామాన్ని నిర్మించిన వైనాన్ని ఆయన విపరీతంగా పొగిడేయటమే కాదు.. దుబాయ్ పురోగతి గురించి తాను ఏళ్లుగా వింటున్నా.. స్వయంగా చూసే అవకాశం మాత్రం తనకు ఇప్పుడే లభించిందని వ్యాఖ్యానించటానికి ఆయన వెనుకాడలేదు.

ఒకరి గురించి ఒకరికి బాగా తెలిసి.. దగ్గరగా ఉన్నప్పటికీ గడిచిన 34 ఏళ్లలో భారత ప్రధానుల్లో ఒక్కరు కూడా యూఏఈకి రాకపోవటం అసాధారణమని వ్యాఖ్యానించారు. ఈ దేశానికి చివరగా 1981లో నాటి భారత ప్రధానమంత్రి ఇందిరా గాంధీ సందర్శించారు. అనంతరం పర్యటిస్తున్న ప్రధాని మోడీ కావటం గమనార్హం. యూఏఈ ప్రభుత్వానికి సందేశం ఇచ్చే హక్కు తనకు లేదన్న మోడీ.. రెండు దేశాల మధ్య స్నేహ సంబంధాలు మరింత బలీయం కావాలని మాత్రమే కోరుకున్నట్లు ఉన్నది ఉన్నట్లుగా చెప్పేశారు.