Begin typing your search above and press return to search.
పవన్ కు అఫీషియల్ గా ముగ్గురు పెళ్లాలు.. తెలియకుండా ఇంకెంతమందో!
By: Tupaki Desk | 7 Oct 2021 8:09 PM ISTగత అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనాని పవన్ కళ్యాణ్ ను భీమవరంలో ఓడించిన వైసీపీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ తాజాగా నోరుపారేసుకుకున్నారు. పవన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏలూరులోని వైసీపీ జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన గ్రంధి శ్రీనివాస్ ఈ సందర్భంగా పవన్ పై వ్యక్తిగత దాడి చేశాడు.
పవన్ కళ్యాణ్ కు ముగ్గురు భార్యలని మాత్రమే బయటి ప్రపంచానికి తెలుసని.. తెలియకుండా ఇంకెంత మంది ఉన్నారో అంటూ గ్రంధి శ్రీనివాస్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. గతంలో ఓ హీరోయిన్ ను గర్భవతిని చేసి రూ.5 కోట్లిచ్చి అబార్షన్ చేయించాడన్న ప్రచారం కూడా ఉందని గ్రంధి ఆరోపించారు.
ఒక రాష్ట్రమంత్రిని సన్నాసి అంటూ పవన్ వ్యాఖ్యానించడం సిగ్గుచేటు అని.. పవన్ ఎంతటి సంస్కారవంతుడో ఆయన మాటలే చెబుతున్నాయన్నారు. మంత్రి సన్నాసి అయితే పవన్ కళ్యాణ్ సన్నాసినర్నర సన్నాసి అంటూ గ్రంధి రెచ్చిపోయారు.
పవన్ కళ్యాణ్ రెండు రోజులు రాష్ట్రమంతటా పర్యటిస్తే అంతా అల్లకల్లోలమైపోతుందని గ్రంధీ శ్రీనివాస్ ధ్వజమెత్తారు. తన అస్థికలు దేశమంతా చిమ్మితే తనలాంటోళ్లు పుడుతారని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడం సిగ్గుచేటన్నారు. పవన్ ఉద్దేశంలో జనసైనికులు, వీర మహిళలు దద్దమ్మలా అంటూ నిలదీశారు. రాజకీయ పార్టీని అడ్డం పెట్టుకొని పవన్ జనసైనికులను అసాంఘిక శక్తులుగా మారుస్తున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు.
పవన్ కళ్యాణ్ ఎక్కడ ఎప్పుడు ఎలా మాట్లాడుతారో తెలియదని.. ఆయనో వింత క్యారెక్టర్ అంటూ గ్రంధీ శ్రీనివాస్ ఆరోపించారు. రాజమండ్రిలో కానిస్టేబుళ్లను తిడుతాడని.. అనంతపురం వెళ్లి మా నాన్న కానిస్టేబుల్ అంటాడని.. పోలీసులంటే ఎంతో గౌరవమని చెబుతాడని ఇదేం వింతో అర్థం కావడం లేదన్నారు.
పవన్ కళ్యాణ్ ఇకనైనా నోరు అదుపులో పెట్టుకోవాలని ఆయన ఒక్క మాటంటే తాము వంద మాటలు అంటామని శ్రీనివాస్ హెచ్చరించారు.