Begin typing your search above and press return to search.

కోవాగ్జిన్‌ వ్యాక్సిన్ ఎఫెక్ట్... హంపీకి నో ఎంట్రీ

By:  Tupaki Desk   |   30 Sep 2021 6:30 AM GMT
కోవాగ్జిన్‌ వ్యాక్సిన్ ఎఫెక్ట్...   హంపీకి నో ఎంట్రీ
X
భారత మహిళల చెస్‌ నంబర్‌ వన్, ప్రపంచ మూడో ర్యాంకర్‌ కోనేరు హంపి స్పెయిన్‌ లో ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ మహిళల టీమ్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌ కోసం బాగా సన్నద్ధమైంది. అందుబాటులో ఉన్న ఆన్‌ లైన్‌ టోర్నీ ల్లో చురుగ్గా పోటీపడింది. అయితే తీరా స్పెయిన్‌ ఈవెంట్‌ ఆడదామనుకుంటే ఆమె తీసుకున్న టీకా వల్ల ఆంక్షలు ఎదురయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌ మాస్టర్‌ హంపి భారత్‌ లో తయారైన కోవాగ్జిన్‌ టీకా తీసుకుంది.

కానీ దీనికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ ఓ) గుర్తింపు లేదు. దీని వల్ల ఆమె స్పెయిన్‌ వెళ్లాలనుకుంటే మునుపటిలాగే కరోనా ప్రొటోకాల్‌ పాటించాలి. 10 రోజుల పాటు కఠిన క్వారంటైన్‌ లో గడపాలి. ఈ విషయాలన్నీ హంపికి స్పెయిన్‌ రాయబార కార్యాలయాన్ని సంప్రదిస్తేనే తెలిశాయి. ‘నార్త్‌ మెసిడోనియా మీదుగా స్పెయిన్‌ వెళ్లాలనుకున్నా. కానీ అక్కడా స్పెయిన్‌ మాదిరిగానే ఆంక్షలు ఉన్నాయి. అక్కడా పది రోజులపాటు క్వారంటైన్‌ లో ఉండాల్సి వచ్చేది. ఆంక్షలు సడలించే అవకాశం ఉందేమోనని భారత చెస్‌ సమాఖ్య కూడా జోక్యం చేసుకుంది. కానీ వారి ప్రయత్నం కూడా ఫలించలేదు’ అని హంపి వివరించింది.

కోవాగ్జిన్‌ పై ఉన్న ఆంక్షల వల్ల ఆమె ఓ మేటి ఈవెంట్‌ లో పాల్గొనలేకపోయింది. ఆమె స్థానం భర్తీ చేసేందుకు ఎంపిక చేసిన పద్మిని రౌత్‌ కు అదే సమస్య ఎదురైంది. కోవాగ్జిన్‌ తో ఆమె కూడా స్పెయిన్‌ పయనం కాలేకపోయింది. డబ్ల్యూహెచ్‌ ఓ ఆమోదించిన కోవిషీల్డ్‌ ను వేయించుకున్న వారికి 122 దేశాలు ఆంక్షలు సడలించాయి.

భారత్ బయో టెక్ సంస్థ... కరోనా మహమ్మారి కి చెక్ పెట్టేం దుకు కోవాగ్జిన్ టీకా ను అభివృ ద్ధి చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాక్సిన్ భారత దేశ ప్రజలకు విజయవంతంగా ఇస్తోంది ఆరోగ్య శాఖ. కానీ ఇప్పటివరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అత్య వసర వినియోగం గుర్తింపు మాత్రం ఈ కోవాగ్జిన్ టీకా కు మాత్రం రాలే దు. ఈ గుర్తింపు కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది భారత్ బయోటెక్ సంస్థ. ఇక తాజాగా మరో సారి భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన ఈ టీకా కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన ప్రపంచ ఆరోగ్య సంస్థ.

ఈ టీకా కు సంబంధిం చిన సాంకేతిక అంశాలపై... భారత్ బయోటెక్ సంస్థను మరిన్ని వివరాలు ప్రపంచ ఆరోగ్య సంస్థ అడిగినట్లు సమాచారం అందుతోంది. దీంతో కోవాగ్జిన్‌కు WHO గుర్తింపు రావడానికి మరికొంత కాలం సమయం పట్టనుంది. దీని ప్రభావం కో వాగ్జిన్‌ తీసుకుని విదేశాలకు వెళ్లాలనుకునే భారతీయుల మీద చాలా స్పష్టంగా కన పడబోతుంది. ముఖ్యంగా అమెరికా, బ్రిటన్‌ వంటి దేశా ల్లో చదువుకోసం వెళ్లాల నుకునే విద్యార్థులుకు ఇది అతి పెద్ద సమస్య.

కో వ్యాగ్జిన్‌కు WHO గుర్తింపు లేకపో తే, మిగతా ప్రపంచ దేశాలు ఏవీ దా న్ని గుర్తించే పరిస్థితి ఉండదు. వ్యాక్సిన్‌ వేసుకు న్నప్పటికీ, ఇతర దేశాల దృష్టిలో వ్యాక్సిన్‌ వేసు కోనట్టే లెక్క. భారత్‌ బయోటెక్‌ సంస్థ మాత్రం వ్యాక్సిన్‌ కు సంబంధించిన అన్ని వివరాలను WHOకి అందజేశామంటోంది. ఇటు భారత ఆరోగ్య శాఖ కూడా కోవాగ్జిన్‌కు త్వరలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోద ముద్ర పడుతుందని ప్రకటించింది.