Begin typing your search above and press return to search.
బడ్జెట్: పంచాయితీలు, మున్సిపాలిటీలకు పండగ
By: Tupaki Desk | 29 Feb 2016 7:46 AM GMTపంచాయితీలు, మున్సిపాలిటీలకు శుభవార్త. ఇకపై కేంద్ర పభుత్వం వీటికి అందించే నిధులు భారీగా పెరగబోతున్నాయి. సోమవారం బడ్జెట్ ప్రకటించిన కేంద్ర మంత్రి అరుణ్ జైట్లో మొత్తంగా మున్సిపాలిటీలు, పంచాయితీలకు రూ.2.87 లక్షల కోట్లు కేటాయించడం విశేషం. ఇది గత ఐదేళ్లలో ఉన్న కేటాయింపు కన్న 228 శాతం ఎక్కువని జైట్లీ ప్రకటించారు. పంచాయితీలకు రూ.80 లక్షలు, మున్సిపాలిటీలకు రూ.21 కోట్ల వరకు నిధులు ఇవ్వబోతున్నట్లు జైట్లీ వెల్లడించారు. కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ దీనికి సంబందించిన మార్గదర్శకాలను రాష్ట్రాలతో సంప్రదించి తయారు చేస్తుందని ఆయన తెలిపారు. 14న ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకే ఇలా పంచాయితీలు, మున్సిపాలిటీలకు నిధులు పెంచినట్లు ఆయన చెప్పారు.
దేశంలో విద్యుత్ సదుపాయం లేని గ్రామాలు ఉండరాదని ప్రదాని కోరుతున్నారని.. ఆ ప్రకారం నిదులు కేటాయిస్తున్నామని ఆయన చెప్పారు. 18 వేల గ్రామాల్లో ఇప్పటికీ విద్యుత్ సౌకర్యం లేదని.. వెయ్యి రోజుల్లో ఈ గ్రామాలన్నింటికీ కరెంటు ఇస్తామని జైట్లీ హామీ ఇచ్చారు. గ్రామాల విద్యుద్దీకరణకు రూ.8500 కోట్లు కేటాయిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. అలాగే గ్రామీణ అభివృద్ధికి రూ.87 వేల కోట్లు, గ్రామీణ ప్రాంతాల్లో వంట గ్యాస్ కనెక్షన్లకు రూ.2 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో కంప్యూటర్ విద్యను అందిస్తామన్నారు. మొత్తంగా గ్రామాలు, పట్టణాల అభివృద్ధికి మోడీ సర్కారు పెద్ద పీట వేసినట్లు బడ్జెట్ చూస్తే అర్థమవుతోంది.