Begin typing your search above and press return to search.

ఆర్ ఆర్ ఆర్ స‌ర్వే: వైసీపీకి గ్రాఫ్ డౌన్‌.. 151 నుంచి 50 స్థానాల‌కు!

By:  Tupaki Desk   |   23 Aug 2021 4:30 PM GMT
ఆర్ ఆర్ ఆర్ స‌ర్వే:  వైసీపీకి గ్రాఫ్ డౌన్‌.. 151 నుంచి 50 స్థానాల‌కు!
X
ఏపీ అధికార పార్టీ వైసీపీ గ్రాఫ్ డౌన్ అవుతోందా? గ‌త 2019 ఎన్నిక‌ల్లో 151 స్థానాల్లో విజ‌యం ద‌క్కించుకున్న ఈ పార్టీకి.. ఇప్పుడు 50 స్థానాలు కూడా ద‌క్కే ప‌రిస్థితి లేదా? అంటే.. ఔన‌నే అంటున్నారు ఆపార్టీ రెబ‌ల్ ఎంపీ.. ఫైర్ బ్రాండ్ నాయ‌కుడు ఆర్ ఆర్ ఆర్‌.. క‌నుమూరి ర‌ఘురామ‌కృష్ణ‌రాజు. నిత్యం ప్రెస్ మీట్ పెట్టి వైసీపీపై విరుచుకుప‌డే ఆయ‌న వైఖ‌రితో వైసీపీకి ఇటీవ‌ల కాలంలో ఇబ్బందులు ఎదురైన విష‌యం తెలిసిందే. సీఎం జ‌గ‌న్‌, వైసీపీ కీల‌క నాయ‌కుడు, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డిల‌ బెయిల్ ర‌ద్దు చేయాల‌ని కోరుతూ.. ఆయ‌న పిటిష‌న్ వేసిన త‌ర్వాత‌.. ఆయ‌న దూకుడు మ‌రింత పెంచారు. ఒక‌వైపు ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను ప్ర‌శ్నిస్తూ.. మ‌రోవైపు.. సీఎం జ‌గ‌న్ చిన్నాన్న వివేకా హ‌త్య కేసు విష‌యాన్ని ఆయ‌న ప్ర‌ధానంగా ప్ర‌స్థావిస్తున్నారు.

``సీబీఐ ఇప్ప‌టికీ ఎందుకు ఈ ఘాతుకానికి పాల్ప‌డిన వారిని ప‌ట్టుకోలేక‌పోతోంది? ఈ విష‌యంలో ఒక అంశాన్ని చ‌ర్చించాలి. వివేకా హ‌త్య జ‌రిగిన త‌ర్వాత‌.. ఈ విష‌యంపై సాయిరెడ్డి మాట్లాడుతూ.. ఆయన గుండెపోటుకు గురై మ‌రణించార‌ని పేర్కొన్నారు. నా పెద్ద సందేహం ఏంటంటే.. ఈ విష‌యాన్ని సాయిరెడ్డికి ఎవ‌రు చెప్పారు? ఆయ‌న‌కు గుండెపోటు వ‌చ్చిన‌ట్టు ఎలా తెలిసింది? సో.. నేను సీబీఐ అధికారుల‌కు విన్న‌విస్తోంది ఏంటంటే.. ముందు మీరు విజ‌య‌సాయిరెడ్డిని ప్ర‌శ్నించండి.. త‌ర్వాత .. అనేక విష‌యాలు వెలుగు చూసే అవ‌కాశం ఉంది`` అని ర‌ఘురామ ప‌దే ప‌దే చెబుతున్న విష‌యం తెలిసిందే.

ఇవ‌న్నీ ఇలా ఉంటే.. ఓ యూట్యూబ్ చానెల్‌లో.. ఇప్ప‌టికిప్పుడు న‌ర‌సాపురం పార్ల‌మెంటు స్థానానికి ఎన్నిక‌లు జ‌రిగితే.. ర‌ఘురామ చిత్తుగా ఓడిపోతారంటూ.. వ్యాఖ్య‌లు చేశారు. దీనిపై స్పందించిన ర‌ఘురామ‌.. తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. ``బ్ల‌డీ ఫూల్‌`` అంటూ.. ఆ వ్యాఖ్య‌లు చేసిన వారిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

``ఈ యూట్యూబ్ చానెళ్లు.. `మ‌రో కొణం`- `మ‌న‌స్సాక్షి`. ఈ చానెళ్లు స‌ర్వే చేసి నా జాత‌కాన్ని నిర్ణ‌యించి.. నేను ఓడిపోతాయ‌ని చెబుతాయా? స‌రే! నేను చేసిన‌ నా సొంత స‌ర్వే ప్ర‌కారం.. ఈ రోజు క‌నుక ఎన్నిక‌లు పెడితే.. నేను 55 శాతం ఓట్లు సంపాయించుకుంటాను. అదే వైసీపీ త‌ర‌ఫున నిల‌బ‌డే అభ్య‌ర్థికి కేవ‌లం 36 శాతం ఓట్లు మాత్ర‌మే ప‌డ‌తాయి. అంటే.. దాదాపు 19 శాతం ఓట్ల తేడా స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ఎక్కువ‌గా క‌ష్ట‌ప‌డుతున్న ఎంపీగా వైసీపీ ఎంపీల్లో గుర్తింపు పొందాను. అనేక స‌ర్వేలు ఈ విష‌యాన్ని స్ప‌ష్టం చేశారు. పార్ల‌మెంటులో మా ఎంపీలంద‌రిలోకీ.. నేను ఎక్కువ ప్ర‌శ్న‌లు అడుగుతున్న‌ట్టు రికార్డులు చెబుతున్నాయి`` అని ర‌ఘురామ వ్యాఖ్యానించారు.

ఆర్ ఆర్ ఆర్ త‌న స‌ర్వేకు సంబంధించి మ‌రిన్ని విష‌యాలు వెల్ల‌డిస్తూ.. రాష్ట్ర స్థాయిలో ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే..2019 ఎన్నిక‌ల‌తో పోల్చిన‌ప్పుడు.. వైసీపీ క‌నీసం 50 శాతం సీట్ల‌లో కూడా గెలిచే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. దాదాపు 100 సీట్ల‌లో ఓడిపోవ‌డం ఖాయంగా ఉంద‌న్నారు. ప్ర‌స్తుతం వైసీపీపై తీవ్ర వ్య‌తిరేక‌త న‌డుస్తోంద‌ని ర‌ఘురామ చెప్పుకొచ్చారు. తొలుత‌.. జ‌గ‌న్‌, సాయిరెడ్డి బెయిల్‌పై దృష్టి పెట్టిన ర‌ఘురామ‌.. త‌ర్వాత‌.. రాష్ట్ర ప్ర‌భుత్వం చేస్తున్న అప్పుల విష‌యాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లారు. త‌ర్వాత నాసిర‌కం లిక్క‌ర్ , త‌ర్వాత‌.. ఉపాధి ప‌నుల నిధుల విష‌యం.. ఇలా అనేక విష‌యాల‌ను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లి.. వాటిపై సీబీఐ ద‌ర్యాప్తున‌కు ఆదేశించాల‌ని.. కోరిన విష‌యం తెలిసిందే.