Begin typing your search above and press return to search.
భయపెడుతున్న మిడతల దండు.. వచ్చేస్తోంది
By: Tupaki Desk | 28 May 2020 6:30 PM GMTపాకిస్తాన్ లోని ఆహార పంటలను నాశనం చేసిన మిడతల దండు భారత్ లోకి ప్రవేశించింది. గుజరాత్, రాజస్థాన్ మీదుగా మహారాష్ట్రాలోకి వచ్చి పంటల మీద పడ్డాయి. ఇప్పుడు దేశానికే ధాన్యాగారంగా నిలిచిన తెలంగాణలోకి ప్రవేశించడానికి రెడీ అయ్యాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
కాగా ఆదిలాబాద్ జిల్లా సరిహద్దుకు 300 కిలోమీటర్ల దూరంలో మిడతల దండు ఉందని సోషల్ మీడియాలో ఫొటోలతో ప్రచారం చేస్తున్నారు. ఇవి రెండు రోజుల్లో ఆదిలాబాద్ కు చేరుకుంటాయని అంటున్నారు. దీంతో ఉమ్మడి ఆదిలాబాద్ లో అధికారులు ఆరాతీస్తున్నారు.
ఇక ఆంధ్రప్రదేశ్ లోకి కూడా మిడతల దండు ఎంట్రీ ఇచ్చిందని వార్తలు వస్తున్నాయి. అనంతపురం జిల్లా రాయదుర్గంలో వందల సంఖ్యలో ఈ రాకాసి మిడతలు క్షణాల్లో జిల్లేడు చెట్టు ఆకులను తినేయడం చూసి స్థానికులు రైతులు ఆందోళన వ్యక్తం చేసినట్టు ప్రచారం సాగుతోంది. ఈ మేరకు వీడియోలు వైరల్ అయ్యాయి.
ఇక ఇదే జిల్లాలోని గోరంట్ల రెడ్ జోన్ లోకి కూడా మిడతలు వచ్చాయని స్థానికులు అంటున్నారు. పట్టణం లోని చౌడేశ్వరి కాలనీ లోకి వందల సంఖ్యలో ముడతలు చొరబడి గంటల వ్యవధి లోనే చెట్ల ఆకులను తినేశాయని అంటున్నారు.
మిడతల దండు తెలుగు రాష్ట్రాలపై ఎంట్రీతో ప్రభుత్వాలు, రైతులు షేక్ అవుతున్నారు. రాబోయే వర్షకాలం సీజన్ లో పంటలు వేస్తే ఎంత నష్టం వేస్తాయేమోనని భయపడుతున్నారు. ఇప్పటికే వీటిని తరమడానికి విదేశాల నుంచి పరికరాలు తెప్పించేందుకు తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్ లు అధికారులతో సమీక్షలు చేస్తున్నారు.