Begin typing your search above and press return to search.
థ్యాంక్స్ గివింగ్ డే.. అమెరికన్ల ఖర్చు $5.29 బిలియన్లు..!
By: Tupaki Desk | 27 Nov 2022 1:30 AM GMTఅగ్రరాజ్యం అమెరికాలో ప్రతి యేటా థ్యాంక్స్ గివింగ్ డే వేడుకలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది కూడా నవంబర్ 25న అమెరికాలో జాతీయ సెలవు దినంగా ప్రకటించి 96వ థ్యాంక్స్ గివింగ్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈక్రమంలోనే అమెరిాలోని విధులన్నీ కార్టూన్ బొమ్మలతో కనువిందు చేశాయి.
పికాచూ.. ఈవీ.. రెడ్.. టైటాన్.. టోని.. బేబీ యోధ వంటి కార్టూన్ బొమ్మల్లో అమెరికన్లు హిలీయం వాయువు నింపి గాల్లోకి ఎగురవేశారు. అమెరికాలోని మాన్ హట్టర్ లోని అప్పర్ వెస్ట్ సైడ్ నుంచి ఉదయం 9 గంటలకు థ్యాంక్స్ గివింగ్ పరేడ్ ప్రారంభమై 12గంటలకు ముగిసింది. మూడు గంటల పాటు నిర్విరామంగా కొనసాగిన ఈ వేడుకలతో న్యూయార్క్ నగరం వెలిగిపోయింది.
అమెరికన్లు తమ కుటుంబం.. స్నేహితులతో కలిసి స్వేచ్ఛగా ప్రేమను పంచుకునేందుకు థ్యాంక్స్ గివింగ్ డేను పెద్ద పండుగలా జరుపుకుంటారు. షాపింగ్.. ఆహారం కోసం ఈ ఒక్క రోజు భారీగా వెచ్చిస్తుంటారు. ఈ ఏడాది జరిగిన థ్యాంక్స్ గివింగ్ డే కోసం ఆన్ లైన్ దుకాణదారులు రికార్డు స్థాయిలో $5.29 బిలియన్లను ఖర్చు చేశారని 'అడోబ్' నివేదికల ప్రకారం వెల్లడైంది.
గతేడాదితో పోలిస్తే ఇది 2.9 శాతం ఎక్కువ. సాధారణ రోజుల్లో ఆన్ లైన్ షాపింగ్ వ్యాపారం రెండు నుంచి మూడు బిలియన్ల వరకు ఉంటుంది. ఈ ఏడాది నిర్వహించిన థ్యాంక్స్ గివింగ్ కోసం ఆన్ లైన్ సంస్థలు భారీ ఆఫర్లు ప్రకటించడంతో అమెరికన్లు రికార్డు స్థాయిలో విక్రయాలు చేశారు. గతేడాదితో పోలిస్తే ఈ ఒక్క రోజు ఆన్ లైన్ విక్రయాలు 10 నుంచి 14 శాతం మేరకు పెరిగాయి.
థ్యాంక్స్ గివింగ్ డే వేడుకల్లో భాగంగా అమెరికన్లు దుకాణాల్లో గంటల తరబడి స్నాప్ చేస్తూ కన్పించారు. అడోబ్ నివేదిక ప్రకారంగా ఈసారి కొన్ని హాటెస్ట్ కేటగిరిలు.. బొమ్మలు.. దుస్తులు.. గ్రిల్స్.. ఎలక్ట్రానిక్ వస్తువులు.. అవుట్ డోర్ పరికరాలను అమెరికన్లు ఎక్కువగా కొనుగోలు చేసేందుకు మక్కువ చూపినట్లు అడోబ్ నివేదికలో వెల్లడైంది.
మొత్తానికి అమెరికాలో జరిగిన థ్యాంక్స్ గివింగ్ డే వేడుకలు అటు ఆన్ లైన్ వ్యాపారులకు కాసుల పంట పండించగా వినియోగదారులకు కూడా అంతే స్థాయిలో ఆనందాన్ని పంచడం విశేషం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.