Begin typing your search above and press return to search.

మహా ట్విస్ట్ : క్యాంపుల కు ఎమ్మెల్యేలు ..విజయం ఎవరిదో ?

By:  Tupaki Desk   |   23 Nov 2019 11:42 AM GMT
మహా ట్విస్ట్ : క్యాంపుల కు ఎమ్మెల్యేలు ..విజయం ఎవరిదో ?
X
మహారాష్ట్ర లో రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారి పోతున్నాయి. నిన్నటి వరకు అధికారం మాకు అక్కర్లేదు అని మౌనం వహించిన బీజేపీ ..రాత్రికి రాత్రికి పక్కా ప్రణాళిక తో అనుకున్న వ్యూహాన్ని అమలుచేసి ..తెల్లవారే సరికే మహాపీఠాన్ని దక్కించుకుంది. దీనితో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలకు కోలుకోలేని షాక్ తగిలింది. ఇందులో ఎన్సీపీ పరిథితి మరింత గందరగోళంగా ఉంది. పార్టీలో చీలిక వచ్చిందా ..లేకా ఇది ఎన్సీపీ ఆడే నాటకమా అని అర్థం కాని పరిస్థితి. కాని , ఇల్లు అలకగానే పండుగ కానట్టు ..సీఎం గా ప్రమాణస్వీకారం చేయగానే అంతా అయిపోయింది అనుకుంటే పొరపాటే ..అసలు పరీక్ష ముందుంది. అదే అసెంబ్లీ లో విశ్వాస పరీక్ష.

బల పరీక్షకు గవర్నర్ వారం రోజుల సమయం ఇవ్వగా.. నాలుగు ప్రధాన పార్టీలు బిజెపి, శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌లు అమీతుమీ తేల్చుకునేందుకు కొత్త రాజకీయానికి తెరలేపాయి. బల పరీక్షకు వారం రోజుల వ్యవధి వుండడం తో ప్రధాన పార్టీలు తమ ఎమ్మెల్యేలను కాపాడుకునే పని ఇప్పటికే ప్రారంభించేసాయి. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, రాజస్థాన్‌ల కు శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ (శరద్) ఎమ్మెల్యేలను తరలించేందుకు ఏర్పాట్లు మొదలు పెట్టాయి. అటు బిజెపి తమ ఎమ్మెల్యేలను ఒక పక్క కాపాడుకుంటూనే ఇండిపెండెంట్లను, శివసేన, ఎన్సీపీకి చెందిన ఎమ్మెల్యేలకు ఆఫర్లు చేస్తున్నట్లు సమాచారం. దీనితో ఈ వారం రోజుల హైడ్రామా తర్వాత ఎవరు నిజమైన విజేత నో ..ఎవరు పరాజితులో తేలి పోనుంది. ఈ నేపథ్యం లో మహారాష్ట్ర లో ఎమ్మెల్యేల కు గిరాకీ మాత్రం విపరీతంగా పెరిగి పోయింది.

ఇకపోతే .. ఇప్పటికే దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్‌లిద్దరు తాము బలపరీక్ష లో నెగ్గుతామని ప్రకటించగా.. కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీ పార్టీల నేతలు బిజెపి వి నీచ రాజకీయాలంటూ ఘాటు విమర్శల కు దిగారు. అలాగే ఇప్పటికే శివసేన కి చెందిన 19 మంది ఎమ్మెల్యే లు రెబల్స్ గా మారారనే ప్రచారం జరుగుతోంది. తాజా లెక్కల ప్రకారం బిజెపి (105) ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం (22) శివసేన చీలిక వర్గం (19) ఇండిపెండెంట్లు (8) కలిసి.. 154 మంది సపోర్టు తమకుందని బిజెపి వర్గాలు  ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఎన్సీపీ , శివసేన పార్టీల వాదన మరోలా ఉంది. శివసేన అయితే తమ పార్టీ ఎమ్మెల్యేల్లో ఒక్కరు కూడా బిజెపి తో వెళ్ళడం లేదని చెప్తుంది. అలాగే .. ఏదో అత్యవసర సమావేశం అంటే తమ ఎమ్మెల్యేలు 11 మంది అజిత్ పవార్‌తో వెళ్ళారని, వారిలో ముగ్గురు తిరిగి తమ క్యాంపులో కి వచ్చేశారని శరద్ పవార్ ప్రకటించారు. ఈ ఉత్కంఠ కి తెరపడాలి అంటే మరోవారం రోజులు వేచి చూడక తప్పదు..