Begin typing your search above and press return to search.

గ్రీస్, టర్కీని వణికించిన భూకంపం.. సునామీ రాక

By:  Tupaki Desk   |   30 Oct 2020 5:10 PM GMT
గ్రీస్, టర్కీని వణికించిన భూకంపం.. సునామీ రాక
X
భారీ భూకంపం టర్కీ దేశాన్ని చిగురుటాకుల వణికించింది. టర్కీలోని ఏజియన్ సముద్రంలో శుక్రవారం భారీ భూకంపం సంభవించింది. దీంతో సునామీ సంభవించింది.పెద్ద పెద్ద రాకాసి అలలు ఎగిసపడ్డాయి. తీరప్రాంలోని ప్రజలు భయంతో రోడ్లపైకి పరుగులు తీస్తూ బతుకు జీవుడా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పారిపోయారు.

టర్కీ తీర సముద్రంలో సంభవించిన ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.6గా నమోదైనట్టు ఎమర్జెన్సీ మేనేజిమెంట్ అథారిటీ (ఏఎప్ఏడీ) ట్వీట్ లో పేర్కొంది. ఇజ్మీర్ ప్రాంతంలో తీవ్రమైన భూప్రకంపనలు రావడం.. సునామీ వచ్చి సముద్రం నీరు ఇళ్లలోంచి పోవడం.. వస్తువులు, కార్లు, ఇతర సామాను కొట్టుకుపోతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు.

ఈ భూకంప తీవ్రతకు ఒక్క బేరాక్లి జిల్లాలోనే 10 భవంతులు పేకమేడల్లో కుప్పకూలాయి. సునామీ నేరు ఇళ్లను ముంచేస్తూ పోయిన వీడియోలు వైరల్ అయ్యాయి.

కుప్పకూలిన శిధిలాల కింద వేలాది మంది ఉన్నారని అధికారులు అంచనా వేస్తున్నారు. వెయ్యి మందికి పైగా గాయపడ్డారని, ఇప్పటి వరకు 22 మంది మృతి చెందారని అధికారులు చెప్తున్నారు. మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు అధికారులు చెప్తున్నారు. టర్కీతో పాటుగా గ్రీస్ లో కూడా భూకంపం సంభవించింది.

ఇక గ్రీస్ రాజధాని ఏథెన్స్ లోనూ భూ ప్రకంపనలు సంభవించాయి. గ్రీస్ కు చెందిన ద్వీపం సామోస్ లోనూ భూకంపం రావడంతో ప్రజలంతా ఇళ్ల నుంచి బయటకు వచ్చారు.