Begin typing your search above and press return to search.
ఆ ఊళ్లో ఉంటామంటే నెలకు రూ.40వేలు ఇస్తారట!
By: Tupaki Desk | 4 July 2019 9:09 AM GMTఇంతకు మించిన బెస్ట్ ఆఫర్ ఉండదేమో? ఎక్కడైనా సరే మనం ఉండాలంటే గంటలు మొదలు కొని రోజుల లెక్క వరకూ వివిధ రూపాల్లో అద్దెలు వసూలు చేయటం చూశాం. కానీ.. అందుకు భిన్నంగా మీరు మా ఊరు వచ్చి ఉండండి మేమే మీకు ఎదురు డబ్బులు ఇస్తామంటున్నారు. ఏదో నాలుగు రోజులు ఉండిపోవటం కాకుండా.. ఆ ఊళ్లో ఉండేందుకు ఓకే చెప్పేసిన పక్షంలో నెలకు రూ.40వేలు చొప్పున ఆర్థికసాయాన్ని అందిస్తామని చెబుతున్నారు.
అలా అని ఆ ఊళ్లో దెయ్యాలు గట్రా ఏమీ లేవు. కాకుంటే వసతులు తక్కువగా ఉండటం.. ప్రతికూల వాతావరణం ఉండటం కారణం.. ఎవరికి వారు ఊరి నుంచి వెళ్లిపోయారు. దీంతో.. ఆ ఊరు కళ తప్పింది. దీన్ని పూడ్చుకునేందుకు సదరు ఊరి మేయర్ కొత్త ఆఫర్ ను తెర మీదకు తెచ్చారు. ఇంతకీ ఈ ఊరు ఎక్కడుందంటారా? అక్కడికే వస్తున్నాం.
గ్రీస్ దేశంలోని అంటీకైథెరా ద్వీపంలో ఉండేందుకు ఓకే చెబితే నెలకు 450 పౌండ్లు.. మన రూపాయిల్లో చెప్పాలంటే రూ.40వేలు ఇస్తామంటున్నారు. ఈ మొత్తాన్ని అక్కడి స్థానిక ప్రభుత్వమే ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. మధ్యధర సముద్రంలోని క్రెటా.. కైథిరా దీవుల మధ్యన అంటీకైథెరా ద్వీపం ఉంది.
ప్రస్తుతం ఆ ద్వీపంలో కేవలం 24 మంది మాత్రమే నివసిస్తున్నారట. వేసవిలో ఇక్కడ నివసించే వారి సంఖ్య మరికాస్త ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. నివాసం ఉండేందుకు వీలుగా ఉన్నప్పటికీ ఆధునీకీకరణ పోకడలు తక్కువగా ఉంటాయి. ఈ ద్వీపంలో ఉన్న ఇబ్బంది ఏమంటే.. ఇక్కడ ఆహారం తక్కువగా దొరుకుతుంది. శీతాకాలంలో ఇక్కడ ఉండటం కాస్త కష్టంగా ఉన్నా.. చాలా అందంగా ఉంటుందట.
జీవితాన్ని పరుగుపందెం మాదిరి కాకుండా విశ్రాంతి తీసుకుంటూ.. విహారాలతో జీవితాన్ని ఎంజాయ్ చేయాలనుకునే వారికి మాత్రం ఈ ద్వీపం స్వర్గధామంగా చెబుతున్నారు. తమ ఆఫర్ తో అయినా తమ ద్వీపానికి ఎక్కువమంది వచ్చి గడపాలని.. గతంలో మాదిరి ఈ ద్వీపం కళకళలాడాలన్నది ఆ ద్వీప మేయర్ ఆకాంక్షగా చెబుతున్నారు. మీరిన్ని ముచ్చట్లు చెబుతున్నారు? మరిన్ని వివరాలు కావాలంటే ఎలా అంటే.. అంటీకైథెరా అధికారిక వెబ్ సైట్ ను చెక్ చేస్తే ఈ ద్వీపానికి సంబంధించిన వివరాలు తెలుస్తాయంటున్నారు.