Begin typing your search above and press return to search.

వామ్మో గ్రీన్ ఛాలెంజ్ : ఒక్క శాతం ప‌చ్చ‌ద‌నం విలువ వెయ్యి కోట్లా ?

By:  Tupaki Desk   |   30 May 2022 2:30 AM GMT
వామ్మో గ్రీన్ ఛాలెంజ్  : ఒక్క శాతం ప‌చ్చ‌ద‌నం విలువ వెయ్యి కోట్లా ?
X
తెలంగాణ‌లో కేసీఆర్ బంధువు ఎంపీ సంతోష్ నేతృత్వంలో జ‌రిగే గ్రీన్ ఛాలెంజ్ కు సంబంధించి ఆస‌క్తిక‌ర విష‌యం ఒక‌టి వెలుగు చూసింది. ఇప్ప‌టిదాకా గ్రీన్ ఛాలెంజ్ కోసం టీ స‌ర్కారు ఎనిమిది వేల కోట్ల‌కు పైగా ఖ‌ర్చు చేసింది. ప‌ర్యావ‌ర‌ణంలో ప‌చ్చ‌ద‌నం శాతం 7.7 శాతం పెరిగింది.

అంటే ఒక్క శాతం ప‌ర్యావ‌ర‌ణం పెంపున‌కు వీళ్లు పెట్టిన ఖ‌ర్చు ఎంత వెయ్యి కోట్ల‌కు పైగానే క‌దా! ఇంకా చెప్పాలంటే 1200 కోట్లు కన్నా ఎక్కువే ! వీళ్లు ఇప్ప‌టిదాకా రూ.8,511 కోట్లు ఖ‌ర్చుచేశారు. ఫ‌లితంగా ప‌ర్యావ‌ర‌ణంలో వ‌చ్చిన మార్పు ఏడు శాతానికి పైగా అని తేలింది. ఇప్ప‌టిదాకా 254 కోట్ల మొక్క‌లు నాటింది. అదేవిధంగా ఓ మ‌ల్టీ క‌ల‌ర్ పుస్తకం కూడా ప్ర‌భుత్వం విడుద‌ల చేసింది.

ఈ యజ్ఞంలో రాజ‌మౌళి లాంటి దిగ్గజ ద‌ర్శ‌కుల‌తో పాటు చిరు, నాగ్ లాంటి చాలా మంది హీరోలు పాల్గొన్నారు. వాళ్లంతా ఈ కార్య‌క్ర‌మానికి బ్రాండ్ అంబాసిడ‌ర్లుగా వ్య‌వ‌హ‌రించారు. ఈ ప్రాజెక్టుకు క్రేజ్ తీసుకునివ‌చ్చారు.

మొత్తానికి ఫారెస్ట్ స‌ర్వే ఆఫ్ ఇండియా చేప‌ట్టిన క్షేత్ర స్థాయి ప‌రిశీల‌న అనంత‌రం, చేసిన అంచ‌నా ప్ర‌కారం తొమ్మిది ల‌క్ష‌ల‌కు పైగా ఎక‌రాల్లో సామాజిక అడ‌వుల పునరుద్ధ‌ర‌ణ సాగింద‌ని తేలింది. అదేవిధంగా 109 అర్బ‌న్ పార్కుల‌ను అభివృద్ధి చేసింద‌ని తేలింది.

మ‌రోవైపు ఇంత‌గా ఖ‌ర్చు చేసినా ప‌ర్యావ‌ర‌ణంలో ప‌చ్చ‌ద‌నం శాతం ఇంకాస్త పెంచ‌వ‌చ్చు అని, నిధుల‌ను కొన్ని దుర్వినియోగం చేసి ఉంటారు అన్న ఆరోప‌ణ‌లూ ఉన్నాయి. అయితే జోగిన‌ప‌ల్లి సంతోష్ వ‌ర‌కూ కొంత కృషి ఉంది. సెల‌బ్రిటీల‌ను తీసుకువ‌చ్చి ఈ కార్య‌క్ర‌మంలో భాగం చేయ‌డం బాగానే ఉంది కానీ.. ఇంకా వేల కోట్ల ఖ‌ర్చులో రావాల్సిన ఫ‌లితాలు అందుకోకుండా ఉండిపోయారే అన్న వాద‌న కూడా ఉంది.

క‌మ్యూనిటీ బేస్డ్ పార్కుల అభివృద్ధి అన్న‌ది కాల‌నీలలో సాధ్య‌మేన‌ని, అందుకు కాల‌నీ అసోసియేష‌న్ల‌ను భాగం చేస్తే మంచి ఫ‌లితాలు వ‌స్తాయ‌ని ప‌ర్యావ‌ర‌ణ వేత్త‌లు అంటున్నారు. ఖ‌ర్చు అధికంగా ఉండి, ఫ‌లితం త‌క్కువ‌గా ఉంటే ఆ ప్రాజెక్టు నిర్వ‌హ‌ణ‌పై ఆర్థిక సంబంధ ఆరోప‌ణ‌లు త‌ప్ప‌క వ‌స్తాయ‌ని, కనుక గ్రీన్ ఛాలెంజ్ కు కేటాయించిన నిధులు, వెచ్చింపుపై సోష‌ల్ ఆడిటింగ్ చేస్తే బాగుంటుంది అన్న వాద‌న కూడా ఉంది.