Begin typing your search above and press return to search.
టోల్ కు లక్షణరేఖలా పచ్చగీత.. ఎందుకంటే?
By: Tupaki Desk | 27 May 2021 11:30 AM GMTటోల్ ఏమిటి? పచ్చగీత ఏమిటి? లక్షణ రేఖ ఏమిటి? వాహనదారులకు గుడ్ న్యూస్ ఏమిటి? అర్థం కావట్లేదా? వివరంగా చెబుతాం వినండి. నేషనల్ హైవేల మీద టోల్ గేట్లు పెట్టేసి.. ఎక్కడికక్కడ బాదేయటం అందరికి అనుభవమే. రోడ్డు మీదకు ఎక్కిన వాహనాల టోలు తీస్తున్న వైనంపై ఉన్న విమర్శల్ని పక్కన పెట్టేస్తే.. ఇలాంటి టోల్ బూత్ వద్ద జరిగే ఆలస్యం.. ప్రయాణ సమయం మీద పడుతూ ఉంటుంది. అందుకే.. ఇలాంటి రద్దీని తగ్గించేందుకు చాలావరకు టోల్ బూత్ లను ఫాస్టాగ్ చేయటం తెలిసిందే. దీంతో.. వాహనాలు ఆగకుండా వెళ్లే పరిస్థితి.
అయితే.. దేశంలోని చాలా టోల్ గేట్ల వద్ద ఇలాంటి పరిస్థితి లేదు. ఇప్పటికి మాన్యువల్ గానే నిర్వహిస్తున్నారు. ఇలాంటి తీరుకు చెక్ పెట్టేందుకు కేంద్రం కొత్త నిర్ణయాన్ని తీసుకుంది. తాజాగా అమల్లోకి వచ్చిన నిబంధన ప్రకారం.. ప్రతి టోల్ వద్ద వంద మీటర్ల దూరంలో ఒక పచ్చ గీతను గీస్తారు. వాహనాలు ఆ లైన్ దాటేస్తే.. దాని ముందున్న వాహనాల వద్ద టోల్ వసూలు చేయకుండా వదిలేయాల్సి ఉంటుంది.
అంటే.. టోల్ గేట్ వద్ద ఎప్పుడూ కూడా వంద మీటర్లకు మించిన వాహనాల వరుస ఉండకూడదు. ఒకవేళ ఉంటే.. వాహనదారుల వద్ద ఎలాంటి టోల్ వసూలు చేయకుండా వాహనాల్ని పంపేయాల్సి ఉంటుంది. కేంద్రం తీసుకున్న తాజా పాలసీ ప్రకారం ఏ టోల్ వద్ద కూడా వాహనం పది సెకన్ల కంటే ఎక్కువ కాలం నిలవకూడదని చెబుతోంది. తాజాగా తీసుకున్న నిర్ణయంతో టోల్ ప్లాజా వద్ద పని చేసే సిబ్బందిలో జవాబుదారీ తనాన్ని పెంచటంతో పాటు.. వాహనాదారుల కష్టాల్ని తగ్గించాలన్నదే లక్ష్యమని చెబుతున్నారు.