Begin typing your search above and press return to search.

మ‌ద్యం హోం డెలివ‌రీకి ఆ రాష్ట్రం గ్రీన్ సిగ్న‌ల్‌.. !

By:  Tupaki Desk   |   1 Jun 2021 5:30 AM GMT
మ‌ద్యం హోం డెలివ‌రీకి ఆ రాష్ట్రం గ్రీన్ సిగ్న‌ల్‌.. !
X
సీఎం కేజ్రీవాల్ నేతృత్వంలోని ఢిల్లీ రాష్ట్ర ప్ర‌భుత్వం తాజాగా మరో సంచలన నిర్ణ‌యం తీసుకున్న‌ది. ఆన్‌ లైన్ లేదా మొబైల్ యాప్ ద్వారా మ‌ద్యం ఆర్డ‌ర్ ఇచ్చిన‌వారికి హోం డెలివ‌రీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భార‌తీయ కంపెనీల‌కు చెందిన మ‌ద్యం కానీ, విదేశాల‌కు చెందిన మ‌ద్యాన్ని అయినా ఇంటికి డెలివ‌రీ చేసుకునేందుకు ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చింది.

క‌రోనా వైరస్ విజృంభణ కారణంగా విధించిన లాక్‌ డౌన్ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ఆంక్ష‌ల‌ను ఢిల్లీలో అమ‌లు చేస్తున్న విష‌యం తెలిసిందే. అయితే ఈ నేప‌థ్యంలో ఎక్సైజ్ చ‌ట్టాల‌ను స‌వ‌రించారు. ఢిల్లీ అబ్కారీ శాక ప్ర‌క‌ట‌న ప్ర‌కారం.. ఎల్-13 లైసెన్సు ఉన్న షాపులు మ‌ద్యాన్ని హోం డెలివ‌రీ చేయ‌వ‌చ్చు. కానీ క‌చ్చితంగా ఆర్డ‌ర్ మాత్రం మొబైల్ యాప్ లేదా ఆన్‌ లైన్ వెబ్ పోర్ట‌ల్ ద్వారా జ‌ర‌గాల్సిందే. అయితే హాస్ట‌ళ్లు, ఆఫీసులు, సంస్థ‌ల‌కు మాత్రం మ‌ద్యం హోండెలివ‌రీ ఉండ‌ద‌న్నారు. ఎల్-13 లైసెన్సు లేని వారు మ‌ద్యం హోం డెలివ‌రీ చేయ‌రాదని తెలిపింది. ఢిల్లీ కొత్త ఎక్సైజ్‌ చట్టం-2021 ప్రకారం మొబైల్ యాప్ లేదా వెబ్ పోర్టల్ ద్వారా ఆర్డర్ చేసినవారికి మద్యం షాపులు హోం డెలివరీ చేయనున్నారు. అయితే పాత ఎక్సైజ్‌ చట్టం నిబంధనల ప్రకారం.. ఎల్-13 లైసెన్స్ ఉన్న మద్య షాపులు మాత్రమే ఇ-మెయిల్, ఫ్యాక్స్ ద్వారా లిక్కర్‌ ఆర్డర్ వస్తే హోం డెలివరీలను నిర్వహించేవి.