Begin typing your search above and press return to search.
చెత్తను కాల్చే అలవాటుతో జేబుకు భారీ చిల్లు
By: Tupaki Desk | 23 Dec 2016 4:34 AM GMTకాస్తంత చెత్త పోగేసిన తర్వాత.. దానికి నిప్పు పెట్టేసే అలవాటు చాలామందిలో కనిపిస్తుంది. ఇలాంటి చర్యలతో పర్యావరణానికి ఏమాత్రం మంచిది కాదని చెప్పినా చెవినెక్కించుకోరు సరి కదా.. రివర్స్ గేర్ లో మాట్లాడే వారిని చాలామందిని చూస్తుంటాం. ఇలాంటి వారికి చెక్ పెట్టేలా తాజాగా ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. బహిరంగ ప్రదేశాల్లో చెత్త కాల్చటంపై కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు.
చెత్త కాల్చటం వల్ల పర్యావరణానికి హాని కలిగిస్తుందని.. భూమి మీద ఏ ప్రాంతంలో అయినా ఈ చర్య చట్టవిరుద్దమేనని జాతీయ హరిత ట్రైబ్యునల్ తేల్చింది. బహిరంగంగా చెత్తను కాల్చటాన్ని పూర్తిగా బ్యాన్ చేసింది. చెత్తను కాల్చే వారిపై చర్యలు తీసుకోవటానికి రూల్స్ ను సిద్ధం చేసింది.
చెత్తను కొద్ది మొత్తంలో పోగేసి కాల్చే వారికి రూ5వేలు కనీస జరిమానాను విధిస్తారు. ఒకవేళ.. ఈ చెత్త సైజు ఎక్కువగా ఉంటే.. రూ.25వేల వరకూ జరిమానాను విధించాలన్న నిర్ణయం తీసుకున్నారు. ఘన వ్యర్థ నియంత్రణ విషయంలో ఆయా రాష్ట్రాలు.. కేంద్రపాలిత ప్రాంతాలు విధిగా అమలు చేయాలని ట్రైబ్యునల్ ఆదేశాలు జారీ చేసింది.
పునర్ వినియోగానికి వీల్లేని ప్లాస్టిక్.. వ్యర్థాల్ని రోడ్లు వేయటానికి వీలుగా ఉపయోగించాలన్న ట్రైబ్యునల్.. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఉపయోగించే ఫ్లెక్సీలు.. ఫ్లాస్టిక్ జెండాల వినియోగంపై నిషేధాన్నిఆర్నెల్ల లోపు తీసుకోవాలని నిర్ణయించారు. ఒకవేళ ఈ అంశంపై రాష్ట్రాలు సానుకూలంగా స్పందించిన చట్టాలు చేస్తే.. విప్లవాత్మక మార్పులు రావటం ఖాయం. మరి.. రాష్ట్ర సర్కార్లు ఇంతటి నిర్ణయానికి సిద్ధమవుతాయా? అన్నదే పెద్ద ప్రశ్న. ఏది ఏమైనా గతంలో మాదిరి ఇష్టారాజ్యంగా చెత్తను కాల్చేసే ధోరణికి మాత్రం చెక్ పడే అవకాశం ఉందని చెప్పక తప్పదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/